AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharath @2025: భూమి నుంచి ఆకాశం వరకు 2025లో భారత్‌ మౌలిక సదుపాయాల విజయాల విజయగాథ

2025 భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక అధ్యాయంగా నిలిచింది. రైలు, రోడ్డు, విమానయానం, సముద్ర మార్గం, డిజిటల్ మౌలిక సదుపాయాలలో ప్రతి దశలోనూ ఈ సంవత్సరం భారతదేశ అభిలాషలు వాస్తవికతగా మారాయి. దేశంలోని అత్యంత దూర ప్రాంతాల నుంచి పెద్ద నగర కేంద్రాల వరకు కనెక్టివిటీ లోతుగా పెరిగింది, దూరాలు తగ్గాయి, ప్రజల ఆకాంక్షలకు ఇసుక, సిమెంట్, రైలు పట్టాలు ఆధారమయ్యాయి. ఇలా ఈ ఏడాది 2025లో భారత్ సాధించిన మైలురాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bharath @2025: భూమి నుంచి ఆకాశం వరకు 2025లో భారత్‌ మౌలిక సదుపాయాల విజయాల విజయగాథ
2025 A Year Of Infrastructure Breakthroughs
Anand T
|

Updated on: Dec 25, 2025 | 8:15 AM

Share

ఆర్థిక సంవత్సరం 2025-26లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం రూ. 11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది, ఇది దేశ GDPలో 3.1 శాతానికి సమానం. అయితే 2047 వరకు భారతదేశం ప్రతి 12-18 నెలలకు $1 ట్రిలియన్ GDPను జోడించే అంచనా ఉంది. ఇది మౌలిక సదుపాయాలు ఆర్థిక వృద్ధికి గుణకారంగా మారింది. అలాగే 2025 ఆ గుణంకాలు కనిపించే ఫలితాలను ఇచ్చింది.

2025లో జరిగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి

మిజోరం మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌

మిజోరంలో మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసి చరిత్ర సృష్టించబడింది. మిజోరం చివరకు భారత జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లో భాగమైంది, ఇది ఈశాన్య భారత్‌కు మార్పు ఒక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను నెరవేర్చింది. ఈ విజయంతో మిజోరం భారత రైల్వే మ్యాప్‌లో చేరింది. 51 కిలోమీటర్ల బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్, రూ.8,000 కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వం నిర్మించింది. అయిజాల్‌ను స్వాతంత్ర్య భారత చరిత్రలో మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు నేరుగా అనుసంధానం చేసింది. అత్యవసర సేవలు, సైనిక లాజిస్టిక్స్, పౌర ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి అవకాశాలు – మిజోరం జనాభాకు ఒకే రైల్వే లైన్‌తో పూర్తిగా మార్పు చెందాయి.

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్‌ బ్రిడ్జ్ నిర్మాణం

భారత ఇంజనీర్లు ప్రపంచంలోనే కొత్త అద్బుతాన్ని సృష్టించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ కింద చెనాబ్ నదిపై ప్రపచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్‌ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ మైలురాయి విజయం కశ్మీర్ లోయను దేశంలోని మిగతా భాగాలతో అన్ని వాతావరణ రైల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానం చేసింది.

దేశంలోనే తొలి ర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్

2025లో భారత్ మౌలిక సదుపాయాల కథ సముద్రాలకు కూడా చేరింది. దేశంలోనే మొదటి సారిగా ప్రభుత్వం వర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్ ను నిర్మించింది. ఇది సాంకేతిక పురోగతి, ప్రత్యేక డిజైన్‌లకు ప్రసిద్ధి చెందింది. అదునిక రామసేగా పిలువబడే ఈ పాంబన్‌ బ్రిడ్జ్‌ను రామనవమి సందర్భంగా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

భారత్‌లో మొదటి డెడికేటెడ్ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్

దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఓడరేవును రూ. 8,900 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. విజిన్‌జాం ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. వికసిత భారత్ ఏకీకృత దార్శనికతలో భాగంగా భారతదేశ సముద్రయాన రంగంలో జరుగుతున్న పరివర్తనాత్మక పురోగతికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.

బిహార్‌లో మొదటి వందే మెట్రో ప్రారంభం

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ ఇండియన్‌ రైల్వే బీహార్‌లో మొదటి వందే మెట్రో సేవలను ప్రారంభించింది. 2024 సెప్టేంబర్ 16న దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు. నమో భారత్ రాపిడ్ రైలు అని పిలువబడే బీహార్ మొదటి వందే మెట్రో రైలు జయనగర్‌ను పాట్నాల మధ్య రాకపోకలు సాగిస్తుంది. ఇది అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌తో కూడిన రైళ్లో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయవచ్చు.ప్రస్తుతం ఉన్న రైళ్లలో సుమారు ఎనిమిది గంటల సమయం పట్టే ప్రయాణాన్ని కేవలం ఐదున్నర గంటల్లోనే చేరుకుంటుంది.

జమ్మూ & కశ్మీర్‌లో Z-మోర్ టన్నెల్:

అన్ని వాతావరణ కనెక్టివిటీని సురక్షితం చేయడం చేస్తూ 2025లో ప్రధానమంత్రి జమ్మూ, కశ్మీర్‌లో స్ట్రాటజిక్ Z-మోర్ టన్నెల్‌ను ప్రారంభించారు. ఇది సోనామార్గ్‌కు ఏడాది పొడవునా కనెక్టివిటీని అందించే, లడఖ్ ప్రాంతానికి ప్రాప్యతను బలోపేతం చేసే కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. ఇది శ్రీనగర్-లేహ్ హైవేపై హిమపాతాలకు గురయ్యే ప్రాంతాలను దాటవేయడానికి నిర్మించబడిన ఈ సొరంగం.

నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

భారత్ విమానయాన సామర్థ్యం పెద్ద ఎత్తున పెరిగింది. నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫేజ్ వన్ ప్రారంభంతో ఈ మైలురాయి ముంబైలోని స్థానిక ఎయిర్‌పోర్టుపై భారాన్ని తగ్గించింది

నావల్ మౌలిక సదుపాయాలకు భారీ సంవత్సరం

2025 నావికాదళ మౌలిక సదుపాయాలకు మైలురాయి సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుంకటే ఆగస్టు 2025లో భారత్ 75%కు పైగా స్వదేశీ కంటెంట్‌తో రెండు స్టెల్త్ ఫ్రిగేట్‌లు INS హిమ్గిరి, INS ఉదయగిరిని ఇండక్ట్ చేసింది. రెండు ప్రతిష్టాత్మక భారత షిప్‌యార్డ్‌ల నుంచి రెండు ప్రధాన సర్ఫేస్ కంబాటెంట్‌లు ఒకేసారి కమిషన్ చేయబడడం ఇది మొదటిసారి.

మారుమూల గ్రామాలకు నెట్‌వర్క్ సేవలు

డిసెంబర్ 2025లో చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలోని కొండపల్లి గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి మొబైల్ టవర్ ఏర్పాటు చేశారు.

160పైగా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మాణం

విమానయాన రంగంలో భారత్‌ కీలక పురోగతిని సాధించింది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా నిలిచింది. ఒక్క ఏడాదిలో 160కిపైగా నూతన ఎయిర్‌పోర్టులను నిర్మించింది. 2014లో దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండగా అది 2025 నాటికి 163కు చేరింది. అదే సమయంలో 2047లో స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకునే భారత్ ఎయిర్‌పోర్ట్‌లను 350-400కు పెంచేలా ప్లాన్ చేస్తోంది.

రైల్వేలలో 100 శాతం విద్యుదీకరణ

పర్యావరణహిత రవాణా దిశగా భారత్ ఈ 2025లో భారీ విజయం సాధించింది. 2025 మార్చి నాటికి దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ 100 శాతం విద్యుదీకరణ పూర్తి చేసింది. దీనివల్ల దేశంలో కర్బన ఉద్గారాలను భారీగా తగ్గాయి..

మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌

భారత్ ప్రపంచలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ నిలించింది. ఒక్క ఏడాదిలోనే దేశంలో 700 కిలో మీటర్లకుపై మెట్రో నెట్‌వర్క్‌ విస్తరించింది. 2014లో 248 కి.మీ నుంచి 2025లో 1,013 కి.మీకి పెరిగింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా గర్వంగా చెప్పుకుంటుంది. ఇది నగర ట్రాన్జిట్ విస్తరణలో తన వేగవంతమైన అడుగులను ప్రతిబింబిస్తుంది.

రోడ్లు, హైవేలుల నిర్మాణం

రహదారుల నిర్మాణంలో భారత్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఆరేళ్లలో 14,000 కిలోమీరట్లకు పైగా రహదారులను నిర్మించింది. దేశంలో జాతీయ రహదారుల (NH) నెట్‌వర్క్ పొడవు మార్చి 2019లో 1,32,499 కి.మీ నుంచి ప్రస్తుతం 1,46,560 కి.మీకి పెరిగింది. 4-లేన్, అంతకంటే ఎక్కువ NH నెట్‌వర్క్ పొడవు 2019లో 31,066 కి.మీ నుంచి 43,512 కి.మీకి 1.4 రెట్లు పెరిగింది.