Google Top Search 2025: గూగుల్‌లో ఈ మహిళల క్రేజ్ ముందు ఎవరైనా తక్కువే.. వీరి హవా మాములుగా లేదుగా..
మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్‌నే. దేని గురించి ఏ అనుమానం ఉన్నా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక సెలబ్రెటీల గురించి తెలుసుకునేందుకు ఎక్కువమంది గూగుల్‌లో వెతుకుతారు. 2025లో ఎక్కువమంది ఈ మహిళల గురించి సెర్చ్ చేశారట.

2025వ ఏడాది మరో ఐదు రోజుల్లో ముగియనుంది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అందరూ కొత్త ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ ఏడాదిలో చోటుచేసుకున్న విషయాల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మనం ఏ డౌట్ వచ్చినా, ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌ని అడుగుతాం. ఛాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చినా సరే.. గూగుల్‌కు ఆదరణ తగ్గలేదు. గూగుల్‌లో ఈ సంవత్సరంలో ఎవరు సెర్చ్‌లో టాప్ ఉన్నారు..? ఎక్కువ దేని గురించి సెర్చ్ చేశారు? అనే విషయాలు బయటకొస్తున్నాయి. 2025లో గూగుల్‌లో ఏ మహిళల గురించి ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేశారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జెమీమా, స్మృతి మంధాన
టీమిండియా ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడిగ్స్ అత్యధికంగా ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్ చేసిన మహిళల్లో టాప్ 10లో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ సెమీస్‌లో ఆమె 127 పరుగులు చేసింది. అలాగే శ్రీలంకతో జరిగిన టీ20లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. దీంతో ఆమె గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. ఇక మరో టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కూడా గూగుల్ మోస్ట్ సెర్చ్ మహిళల జాబితాలో ఉన్నారు. గత ఏడాది డబ్ల్యూపీఎల్‌లో బెంగళూరు టీమ్‌కు కప్ అందించడంతో పాటు ఈ ఏడాది వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానానికి చేరుకుంది. దీంతో ఆమె గురించి ఎక్కువమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కృతి ససన్ గురించి
స్టార్ సెలబ్రెటీ అనీత్ పడ్డా నటించిన తొలి సినిమా సయ్యారా రూ.500 కోట్ల కలెక్షన్లను సంపాదించింది. అంతేకాకుండా ఐఎండీబీ ప్రకటించిన ఇండియలో టాప్ సెలబ్రెటీల జాబితాలో ఆమె చోటు సంపాదించుకుంది. దీంతో అనీత్ పడ్డా గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. ఇక భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ చిక్కుకున్న విషయం తెలిసిందే. తిరిగి అక్కడ నుంచి తీసుకురావడంతో గూగుల్ సెర్చ్‌లో ఆమె గురించి ఎక్కువమంది వెతికారు. ఇక హీరోయిన్ కృతి సనన్ గురించి కూడా ఎక్కువమంది సెర్చ్ చేశారు. ఐఎండీబీ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అందమైన హీరోయిన్‌గా పేరు పొందగా.. సినిమాలతో పాటు వ్యాపారంలోనూ ఆమె రాణిస్తోంది. దీంతో కృతి సనన్ గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు.
