VARANASI: 20 ఏళ్ల తర్వాత మళ్ళీ జక్కన్నతో జతకట్టిన వర్సటైల్ యాక్టర్! స్కెచ్ అదిరిపోయిందిగా
టాలీవుడ్ సూపర్ స్టార్ మరియు ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడి కలయికలో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్టుపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేసిన ఈ సినిమా, ఇప్పుడు తన తారాగణంతో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మరియు ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడి కలయికలో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్టుపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేసిన ఈ సినిమా, ఇప్పుడు తన తారాగణంతో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్ర కోసం ఒక విలక్షణ నటుడిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన మళ్ళీ ఈ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నారు. అంతేకాదు, షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ ‘విలక్షణ నటుడు’ ఎవరు? ఆయన చేసే ఆ పవర్‌ఫుల్ పాత్ర ఏంటి?
సినిమా రంగంలో ఎంతటి వారికైనా సరే ఒక మంచి పాత్ర దొరికినప్పుడు కలిగే తృప్తి వేరు. సదరు సీనియర్ నటుడు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని వ్యక్తం చేశారు. “వారణాసి అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది.. నా లోపల ఉన్న నటుడి దాహార్తిని ఈ పాత్ర తీర్చుతోంది” అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. దీనిని బట్టి ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేసే ఆయన, రాజమౌళి సినిమాలో కనిపిస్తున్నారంటే అది ఖచ్చితంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఒక సూపర్ హిట్ యాక్షన్ సినిమాలో ఆయన ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిశారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఇక హీరో విషయానికి వస్తే, ఆయనతో ఈ నటుడికి దశాబ్దాల అనుబంధం ఉంది. తండ్రిగా, బాబాయ్‌గా, విలన్‌గా ఆ హీరో సినిమాల్లో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ ‘గ్లోబల్ అడ్వెంచర్’ లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయట.

Maheshbabu And Prakash Raj
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి చిత్రం ‘వారణాసి’లో కీలక పాత్ర పోషిస్తున్న ఆ నటుడు మరెవరో కాదు.. ప్రకాష్ రాజ్! మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘విక్రమార్కుడు’ తర్వాత ప్రకాష్ రాజ్ మళ్ళీ రాజమౌళి సినిమా చేయలేదు. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టుతో వారిద్దరూ మళ్ళీ ఒకటి కావడం విశేషం.
Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰
— Prakash Raj (@prakashraaj) December 23, 2025
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేరికతో మరింత వెయిట్ పెరిగింది. తన నటనతో ఏ పాత్రకైనా జీవం పోసే ప్రకాష్ రాజ్, రాజమౌళి విజన్‌లో ఎలా కనిపించబోతున్నారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మొత్తానికి ‘వారణాసి’ రోజుకో క్రేజీ అప్‌డేట్‌తో బాక్సాఫీస్ వద్ద ఇప్పుడే హీట్ పెంచేస్తోంది!
