AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baahubali The Epic: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ది ఎపిక్.. ఎక్కడ చూడొచ్చంటే..

బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని మార్చేసిన మూవీ. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. రెండు బాగాలుగా రూపొందించిన ఈ మూవీని ఇటీవలే బాహుబలి ది ఎపిక్ పేరుతో మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Baahubali The Epic: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ది ఎపిక్.. ఎక్కడ చూడొచ్చంటే..
Baahubali The Epic Movie
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2025 | 7:51 AM

Share

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించారు. అలాగే కట్టప్ప పాత్రలో సత్యరాజ్, నాజర్ సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రూపొందించారు జక్కన్న. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే ప్రాజెక్టుగా రూపొందించారు.

బాహుబలి ది ఎపిక్ సినిమాను ఇటీవలే థియేటర్లలో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్క్రైబర్స్ కు క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 25 అర్దరాత్రి నుంచి నెట్ ఫిల్క్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ థ్రిల్ మిస్ అయిన అడియన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూడొచ్చు.

దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండే ఈ వెర్షన్ ఆద్యంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇది అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. రెండు భాగాలను ఒకేసారి చూడడం.. అద్భుతమైన విజవల్స్ మరోసారి జనాలను ఆకట్టుకోనుంది. ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదైలన బాహుబలి ది ఎపిక్ మూవీ దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌