ICON STAR: 5 సినిమాలు లైన్‌లో పెట్టిన అల్లు అర్జున్? 2027, 2028 బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్!
పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులను ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఆయన నుంచి రాబోయే ఐదు భారీ సినిమాల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కేవలం తెలుగులోనే ..

పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులను ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఆయన నుంచి రాబోయే ఐదు భారీ సినిమాల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో తన సత్తా చాటడానికి బన్నీ సిద్ధమయ్యారు. ఆ క్రేజీ సినిమాలేవో చూద్దాం..
అట్లీతో భారీ సైన్స్ ఫిక్షన్ (AA22)..
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా మల్టిపుల్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్ల ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘అండర్ వాటర్’ (నీటి అడుగున) పోరాట సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
సందీప్ రెడ్డి వంగాతో వైల్డ్ యాక్షన్..
‘యానిమల్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఒక సినిమా కమిట్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సందీప్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే 2027 చివరిలో లేదా 2028లో బన్నీతో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను..
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అల్లు అర్జున్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. అలాగే ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీనుతో మరో మాస్ ఎంటర్టైనర్ చేయడానికి బన్నీ సుముఖంగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.
పుష్ప 3 – ది రాంపేజ్..
అన్నిటికంటే ముఖ్యంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ‘పుష్ప 3’ కోసం. పుష్ప 2 తర్వాత ఈ సిరీస్ ముగిసిపోదు అని, పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమాను 2028 నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ విజన్ ప్రకారం ఈ మూడో భాగం అంతర్జాతీయ స్మగ్లింగ్ నేపథ్యంలో మరింత భారీగా ఉండబోతోంది.
అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే ఆయన కేవలం టాలీవుడ్ స్టార్‌గానే కాకుండా ఇండియన్ సినిమాను ఏలే గ్లోబల్ స్టార్‌గా ఎదగడానికి సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది. అట్లీ, సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్లతో ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తాయో వేచి చూడాలి. బన్నీ ఫ్యాన్స్‌కు మాత్రం రాబోయే రోజుల్లో పూనకాలు ఖాయం!
