Curry leaves Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..
సాధారణంగా వంట రుచిని పెంచేందుకు కరివేపాకును ఉపయోగిస్తుంటారు. భారతీయ వంటకాలలో ఖచ్చితంగా

సాధారణంగా వంట రుచిని పెంచేందుకు కరివేపాకును (Curry Leaves) ఉపయోగిస్తుంటారు. భారతీయ వంటకాలలో ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. కరివేపాకు కేవలం వంటకాల రుచి మాత్రమే పెంచుతుంది అనుకుంటే పొరపాటే. రుచితోపాటు.. ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాల లభిస్తాయి. ఇవి కాలేయం.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు.. బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.
ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తీసుకోవడం వలన ఉత్సాహంగా ఉంటారు. ఇందుకోసం నిమ్మరసం, కరివేపాకు రసాన్ని లేత చక్కెరతో కలిపి తీసుకోవాలి. వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ప్రతిరోజూ కరివేపాకును తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. కరివేపాకు సిర్రోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలేయాన్ని బలంగా ఉంచుతుంది. కరివేపాకు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది. అలాగే.. మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
అలాగే స్థూలకాయం సమస్యతో ఇబ్బందిపడేవారు.. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు కరివేపాకును తినడం మంచిది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులతో కరివేపాకును తీసుకోవాలి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడడమే కాకుండా.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గమనిక :- ఈ కథనంలో ఉన్న సమాచారం కేవలం నివేదికలు… ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ చిట్కాలను అమలు చేసేముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..
Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్
Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..
Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు
