AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

ప్రముఖ దివంగత నిర్మాత  బీఏ రాజు(BA Raju) తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ (Siva Kumar) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు లావణ్య (Lavanya)తో కలిసి పెళ్లిపీటలెక్కాడు.

BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..
Basha Shek
|

Updated on: Jan 25, 2022 | 11:19 AM

Share

ప్రముఖ దివంగత నిర్మాత  బీఏ రాజు(BA Raju) తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ (Siva Kumar) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు లావణ్య (Lavanya)తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ఈనెల 22న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. అనంతరం ‘పుణెలో పెరిగి హైదరాబాద్ లో స్థిరపడిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో నా వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ  తన వివాహ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

సరిగ్గా ఆ  ముహూర్తానికే..

పూరి జగన్నాథ్‌, వివి. వినాయక్‌ వంటి  అగ్రదర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు శివకుమార్. ఆ తర్వాత దర్శకుడిగా మారి ’22’అనే సినిమాను తెరకెక్కించాడు. కాగా శివకుమార్ కు ఇష్టమైన సంఖ్య 22. అందుకే తన మొదటి సినిమాకు సైతం ’22’ అనే టైటిట్ పెట్టాడు. ఇక తన పెళ్లి ముహూర్తం కూడా తన ఇష్టమైన సంఖ్యతోనే సెట్ చేసుకున్నాడు. సరిగ్గా 2022, జనవరి22వ తేదీన, 22 గంటలకు శివకుమార్, లావణ్యలు పెళ్లి చేసుకోవడం విశేషం. కాగా వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.  పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also read: Coronavirus: శాంతిస్తోన్న కరోనా.. వరుసగా రెండో రోజూ తగ్గిన కొత్త కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Andhra Pradesh: ఏపీలో8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. విజయవాడ కమిషనర్ గా ఎవరు రానున్నారంటే..  

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై