Coronavirus: శాంతిస్తోన్న కరోనా.. వరుసగా రెండో రోజూ తగ్గిన కొత్త కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

గత కొన్ని రోజులుగా  బుసలు కొడుతోన్న కరోనా (Covid 19) మహమ్మరి కొద్దిగా శాంతిస్తోంది.  నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో (Daily Cases) తగ్గుదల కనిపిస్తోంది

Coronavirus: శాంతిస్తోన్న కరోనా.. వరుసగా రెండో రోజూ తగ్గిన కొత్త కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..
India Corona Cases
Follow us
Basha Shek

|

Updated on: Jan 25, 2022 | 10:11 AM

గత కొన్ని రోజులుగా  బుసలు కొడుతోన్న కరోనా (Covid 19) మహమ్మరి కొద్దిగా శాంతిస్తోంది.  నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో (Daily Cases) తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా 5 రోజుల పాటు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా..  నిన్నటి నుంచి ఆ సంఖ్య తగ్గుతుండడం కాస్తా ఊరటనిస్తోంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంట్లలో కొత్తగా 2, 55, 874 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 614 మంది మృత్యువాత పడ్డారు.  దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  4, 90, 462కి చేరింది.  ఇక నిన్న కరోనా నుంచి 2, 67, 753 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు  వైరస్ ను జయించినవారి సంఖ్య 3,70,71,898 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22, 36, 842  కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భారీగా తగ్గిన పాజిటివిటీ రేటు..

ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు కూడా భారీగా తగ్గింది.  నిన్న  20.75 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.52 శాతానికి దిగివచ్చింది.  అయితే వీక్లీ పాజిటివిటీ రేటు 17.17 శాతానికి పెరిగింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు.. 93.15 శాతం, మరణాల రేటు 1.23 శాతం, యాక్టివ్ కేసుల శాతం 5.62 శాతంగా ఉంది.

ఇక మరోవైపు కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న (జనవరి24) దేశంలో మొత్తం 62, 29, 956 వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1, 62, 92, 09,308 కి చేరిందని పేర్కొంది.

Also Read: