Covid Vaccine: అర్హత ఉండి ప్రికాషన్ డోసు తీసుకోనివారికి జీతాలు కట్.. ఆదేశాలు జారీ చేసిన ఆ జిల్లా కలెక్టర్..
దేశంలో కరోనా (covid 19) కోరలు చాస్తోంది. రోజుకు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం
దేశంలో కరోనా (covid 19) కోరలు చాస్తోంది. రోజుకు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు అదనంగా ప్రికాషన్ డోసు(Precaution Dose) ను కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో పాటు 60 ఏళ్లు పైబడి ఉండి దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ అదనపు డోస్ ను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అర్హులైన వారికి ఈ డోస్ ను పంపిణీ చేస్తున్నాయి. అయితే కొంతమంది అర్హత ఉన్నా ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కలెక్టర్ మనీశ్ సింగ్ కొత్త ఉత్వర్వులను జారీ చేశారు. అర్హత ఉండి ప్రికాషన్ డోసు తీసుకోని వారికి జీతాలు నిలిపి వేస్తామని హెచ్చరించారు. ఈమేరకు జిల్లా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అందుకే ఈ ఆదేశాలు..
కాగా ఇండోర్ జిల్లాలో సుమారు 96 వేల మంది కరోనా ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంది. అయితే జనవరి 10 నుంచి ఇప్పటివరకు కేవలం సగం మంది మాత్రమే ఈ అదనపు డోస్ ను తీసుకున్నారు. ఈక్రమంలోనే బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేసే క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ మనీశ్ సింగ్ తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు వివిధ ఆస్పత్రుల్లో పనిచేసే వారందరూ తప్పనిసరిగా ప్రికాషన్ డోస్ తీసుకోవాలని ఆయన కోరారు. కాగా మధ్యప్రదేశ్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇండోర్ కూడా ఒకటి. తాజాగా అక్కడ 2, 665 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు అక్కడి అధికారులు. ఇందులో భాగంగానే ఇండోర్ జిల్లా మనీశ్ సింగ్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also read: Viral News: టెట్ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పలు.. బిడ్డకు ఏం పేరు పెట్టారంటే..
Super Computer: హై స్పీడ్ కంప్యూటర్.. ఏఐ టెక్నాలజీతో మెటా అద్భుత సృష్టి.. వెల్లడించిన జుకర్‌బర్గ్!
BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..