Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ డాక్టర్ డి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కోవిడ్ వ్యాప్తి లేదని అన్నారు. పాజిటివిటి రేటు 10 శాతం దాటితే మాత్రమే కర్ఫ్యూ..
Telangana Night Curfew: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ డాక్టర్ డి శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు. రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కోవిడ్ వ్యాప్తి లేదని అన్నారు. పాజిటివిటి రేటు 10 శాతం దాటితే మాత్రమే కర్ఫ్యూ అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటి రేటు 3.16 శాతం ఉందని ఆయన వివరించారు. ఒక్క జిల్లాలోనూ ఆ రేటు 10 శాతం మించలేదని డీహెచ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్ని కోవిడ్ నివేదికను సమర్పించింది.
తెలంగాణలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు నెలకొన్న కోవిడ్ వ్యాప్తి రేటును పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 4.26 శాతం, మేడ్చల్ 4.22 శాతం, మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం నమోదైంది. ఇక అతి తక్కవ వ్యప్తి కొత్త గూడెంలో ఉంది.. అక్కడ 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉంది.
ఈ నెల 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వారం రోజులుగా లక్షకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన డీహెచ్చ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జర్వం సర్వే జరుగుతోందన్నారు. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కరోనా కిట్లను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. 18 ఏళ్లోపు ఉన్నవారిలో 59 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. రాష్ట్రంలో 2.16లక్షల మందికి ప్రికాషన్ డోసులు ఇచ్చినట్లుగా డీహెచ్ శ్రీనివాస్ తన నివేదికలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: YSR EBC Nestham: అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక సాయం.. వారి ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన సీఎం జగన్
Akhanda Remake: బాలయ్య అఖండకు బాలీవుడ్‌లో యమా క్రేజ్.. పోటీ పడుతోన్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..