Covid Third Wave: కోవిడ్ థర్డ్ వేవ్‌లో వారిలో మరణాల శాతం ఎక్కువే.. పూర్తి వివరాలు
Covid-19 Third Wave: ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Varient) ప్రభావంతో దేశంలో ఏర్పడిన కోవిడ్-19 థర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం లేదని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే థర్డ్ వేవ్‌లో..
Covid-19 Third Wave: ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Varient) ప్రభావంతో దేశంలో ఏర్పడిన కోవిడ్-19 థర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం లేదని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే థర్డ్ వేవ్ కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో పలువురు సీనియర్ సిటిజన్లు కోవిడ్ బారినపడి మృతి చెందినట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. డెల్టా వేరియంట్ కారణంతో గత ఏడాది ఏర్పడిన సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్‌లోనే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు మృతి చెందినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వెల్లడించింది. అయితే మొత్తం మరణాలను పరిగణలోకి తీసుకుంటే సెకండ్ వేవ్ కంటే తగ్గువగానే థర్డ్ వేవ్‌లోనే కోవిడ్ మరణాలు సంభవించాయి. థర్డ్ వేవ్ కారణంగా జనవరి మాసంలో ఇప్పటి వరకు ముంబై మహానగరంలో మొత్తం 159 మంది కరోనా బారినపడి మృతి చెందినట్లు బీఎంసీ గణాంకాలు తెలిపాయి. అయితే ఇందులో 84 శాతం మంది మృతులు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సెకండ్ వేవ్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఏర్పడిన థర్డ్ వేవ్‌లో సీనియర్ సిటిజన్ల మరణాలు ఎక్కువ శాతం నమోదయ్యాయి.
కోవిడ్ బారినపడి మృతి చెందిన 159 మందిలో 60 ఏళ్లకు పైబడిన వారు 134 మంది ఉన్నారు. 40 నుంచి 60 ఏళ్ల లోపు వారు 20 మంది ఉన్నారు. 40 ఏళ్ల లోపు వారు ఐదుగురు ఉన్నట్లు బీఎంసీ తెలిపింది. మృతుల్లో 86 శాతం మంది ఇది వరకే ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, వ్యాక్సిన్లు వేసుకున్న వారు, ఒక్క డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్న వారు ఉన్నారు.
గత ఏడాది సెకండ్ వేవ్ సమయంలో ముంబైలో కోవిడ్ కారణంగా మృతి చెందిన 60 ఏళ్లకు పైబడిన వారు..ఏప్రిల్ మాసంలో 65 శాతం, మే మాసంలో 60 శాతం మంది ఉన్నారు. 40-60 ఏళ్ల వారిలో ఏప్రిల్ మాసంలో 30 శాతం, మే మాసంలో 32.5 శాతం మంది ఉన్నారు.
Also Read..
Viral Video: పామును మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు.. తీరా చూస్తే సీన్ రివర్స్.. వైరల్ వీడియో!
AP Corona Cases: తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు.. గత 24 గంటల్లో 13,819 మందికి కరోనా..