Kidney Damaging Foods: మీ కిడ్నీలు పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాలు వెంటనే మానేయండి!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఒంట్లోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల మాదిరిగానే కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అవి శరీరంలో ఫిల్టర్లు మాదిరి పని చేస్తాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి. రక్తాన్ని ఫిల్టర్ చేసి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం..

Kidney Damaging Foods: మీ కిడ్నీలు పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాలు వెంటనే మానేయండి!
Kidney Damaging Foods
Follow us

|

Updated on: Apr 21, 2024 | 1:20 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఒంట్లోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల మాదిరిగానే కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అవి శరీరంలో ఫిల్టర్లు మాదిరి పని చేస్తాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి. రక్తాన్ని ఫిల్టర్ చేసి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల మన రోజువారీ ఆహారంలో తప్పుడు అలవాట్లను అనుసరించడం వల్ల కిడ్నీలు పలు సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినకూడని ఆహారాలు ఇవే..

అరటి

అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కానీ ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. అయితే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో అరటిపండ్లను చేర్చుకోకపోవడమే మంచిది.

వేయించిన బంగాళదుంపలు

మీకు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలను తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. అది మీ కిడ్నీలకు మంచిది కాదు. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే వేయించిన వాటిని తినడం మానుకోవాలి. ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు బంగాళాదుంపలను తినడం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలకు ఎంతమాత్రం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

కాఫీ-టీ

కాఫీ, టీ, సోడా వంటి ఆహారాలలో కెఫిన్ ఉంటుంది. ఇది మీ మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కెఫిన్ రక్త ప్రసరణ, రక్తపోటు, మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

ఉప్పు

ఉప్పులో సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలలో క్యాన్డ్ సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు, సాసేజ్‌లు, పిజ్జాలు, కెచప్, బార్బెక్యూ సాస్, సోయా సాస్, ఊరగాయలు ఉన్నాయి.

సోడా

సోడాలో చక్కెర అధికంగా ఉంటుంది. పోషక విలువలు అతితక్కువగా ఉంటాయి. రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్బోనేటేడ్ సోడాలు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కార్బోనేటేడ్, ఎనర్జీ డ్రింక్స్ రెండూ కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..