Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..? అయితే, మీ ఆయుష్షు తగ్గినట్టే..! జాగ్రత్త..

ల్యాప్‌టాప్‌ముందు ఎక్కువ సమయం పాటు కూర్చోవటం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యం, శ్రేయస్సుపై అనేక తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని సూచిస్తున్నారు. అందుకే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Health Tips: రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..? అయితే, మీ ఆయుష్షు తగ్గినట్టే..! జాగ్రత్త..
Sit In Front Of The Laptop
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 19, 2024 | 10:43 AM

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేయడం సర్వసాధారణం. చాలా మంది సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగుల పని ల్యాప్‌టాప్‌లోనే జరుగుతుంది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతిదీ ల్యాప్‌టాప్‌ ఆధారంగానే జరుగుతుంది. కానీ దీని వల్ల అనేక సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే, ల్యాప్‌టాప్‌ముందు ఎక్కువ సమయం పాటు కూర్చోవటం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యం, శ్రేయస్సుపై అనేక తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని సూచిస్తున్నారు. అందుకే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

స్క్రీన్ వైపు ఎక్కువసేపు చూస్తూ ఉండటం వలన కంటికి అసౌకర్యం కలుగుతుంది. దీంతో కల్లు పొడిబారడం, అలసట వంటివి కలుగుతుంది. మెడ, భుజం నొప్పి : కూర్చున్నప్పుడు పేలవమైన భంగిమ మెడ, భుజాలపై ఒత్తిడి తెచ్చి, అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే, నిరంతర టైపింగ్, మౌస్ వాడకం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, టెండొనిటిస్, ఇతర మస్క్యులోస్కెలెటల్ సమస్యల వంటి RSIలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు.

సరైన మద్దతు లేకుండా ఎక్కువసేపు ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోవడం వల్ల నడుము నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం ల్యాప్‌టాప్ వాడకంతో ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవాల్సి వస్తుంది. దాంతో బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అందుకని కనీసం అరగంటకు ఒక్కసారైనా లేచి ఒక ఐదునిమిషాలు అటూ ఇటూ నడిచి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అదే పనిగా గంటల తరబడి కూర్చుని పని చేయటం వల్ల భుజాలు, వీపు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. అలాగే, వీరిలో శారీరక శ్రమ కూడా తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ గంటలు గడపడం వల్ల శారీరక శ్రమకు లభించే సమయం తగ్గిపోతుంది. దాంతో పూర్తి శరీరం కదలకుండా నిశ్చలంగా ఉండాల్సిన వస్తుంది. ఇది మరింరత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. కాబట్టి కూర్చున్న చోటే కూరర్చుని కొన్ని వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తే మంచిది. సరైన స్థితిలో కూర్చోవాలి: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సర్వైకల్ సమస్య, వెన్నునొప్పి వంటివి వేధిస్తాయి. అందుకే మన తలకు సమానంగా ఉండేలా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండే కుర్చీలోనే కూర్చోవాలి.

ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం వల్ల ముఖ్యంగా నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, నిద్రపోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే కంటి సమస్యలు వస్తాయి, చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ ప్రభావాలను తగ్గించడానికి, క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం, మంచి ఎర్గోనామిక్స్ చేయడం, సరైన భంగిమను నిర్వహించడం, శారీరక శ్రమను పెంచుకోవటం చాలా ముఖ్యం. దీంతో పాటు బ్లూ లైట్ ఫిల్టర్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. లేదంటే కంటి ఒత్తిడిని తగ్గించడానికి, సాంకేతికత వినియోగం, ఇతర కార్యకలాపాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను కొనసాగించడానికి స్క్రీన్ సెట్టింగ్‌లను అనుకూలంగా సర్దుబాటు చేసుకోండి.

అందుకే మన తలకు సమానంగా ఉండేలా కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే కంటి సమస్యలు వస్తాయి, చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండే కుర్చీలోనే కూర్చోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..