Cleaning Hack: ఐరన్ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి కొత్తదానిలా మెరిసిపోతుంది..
నల్లబడిన ఇనుప పాన్‌లో వండిన ఆహారం కూడా నల్లగా కనిపిస్తుంది. దీని కారణంగా తినాలని అనిపించదు. అటువంటి పరిస్థితిలో దానిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. కానీ కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు నల్లబడిన ఇనుప పాత్రను నిమిషాల్లో కొత్తదిగా మార్చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి ఇంట్లోనూ వంట చేసేందుకు ఉపయోగించే ఐరన్ పాన్ అమ్మమ్మల కాలం నుండి వాడుకలో ఉంది. ఇనుప పాత్రలో వండటం వల్ల అందులో ఐరన్ పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల ఆహారం రుచిగానూ, పోషకాహారంగానూ మారటానికి కారణం అవుతుంది. అయితే దీని సమస్య ఏమిటంటే అది చాలా త్వరగా జిడ్డుబారిపోవడం, నల్లగా మారి అందులో నూనె పొరలు పేరుకుపోవడం జరుగుతుంది.. ఈ సమస్య ప్రత్యేకంగా దాని హ్యాండిల్, అంచులలో ఎక్కువగా కనిపిస్తుంది. నల్లబడిన ఇనుప పాన్‌లో వండిన ఆహారం కూడా నల్లగా కనిపిస్తుంది. దీని కారణంగా తినాలని అనిపించదు. అటువంటి పరిస్థితిలో దానిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. కానీ కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు నల్లబడిన ఇనుప పాత్రను నిమిషాల్లో కొత్తదిగా మార్చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
డిటర్జెంట్..
నల్లగా, జిడ్డుబారిన ఇనుప పాన్‌ను డిటర్జెంట్‌తో మెరిసేలా చేయడం చాలా సులభం. దీంతో పాన్‌ను తక్కువ సమయంలో శుభ్రం చేసుకోవచ్చు. దీని కోసం వేడి నీటిలో డిటర్జెంట్, బేకింగ్ సోడా కలపండి. ఈ నీటిని పాన్‌లో పోసి అరగంట పాటు అలా వదిలివేయండి. కాసేపట్లో డిటర్జెంట్ నీరు నల్లగా కనిపించడం మొదలవుతుంది.. అప్పుడు మీరు స్ర్కబ్బర్ సాయంతో అన్ని వైపులా రుద్దడం వల్ల ఈజీగా శుభ్రం చేయవచ్చు. ఇది మొండి జిడ్డును, నలుపును సులభంగా తొలగిస్తుంది.
వంట సోడా..
బాగా నల్లగా మారిన ఐరన్ పాన్‌ను బేకింగ్ సోడాతో కొత్తదానిలా మెరుస్తూ కనిపించేలా చేసుకోవచ్చు. దీని కోసం ఒక లీటరు నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా, నాలుగు చెంచాల ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ వేడి నీటిని నల్లగా మారిన పాన్‌లో పోసి అరగంట అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఈజీగా మీ నల్లబడిన పాన్ పూర్తిగా శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది.
నిమ్మకాయ లేదా చింతపండుతో తిరిగి మెరుపును తెస్తుంది..
నిమ్మకాయను అనేక వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటారు..నిమ్మకాయతో జిడ్డుగా మారిన ఐరన్‌పాన్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం నల్లగా మారిన బాణలిలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు చెంచాల నిమ్మరసం, నాలుగు చెంచాల డిటర్జెంట్ పౌడర్ వేసి పది నిమిషాలు మరిగించి అలానే ఉంచాలి. దీన్ని రుద్ది అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మకాయ కాకుండా, పండిన చింతపండుతో కూడా ఐరన్ పాన్ శుభ్రం చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..