AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదిక కూడా 11 శాతం కంటే ఎక్కువ గుండెపోటు కేసులు బాత్రూమ్‌లో సంభవిస్తున్నాయని పేర్కొంది. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వంటి కేసుల్లో...

Lifestyle: గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
Heart Attack
Narender Vaitla
|

Updated on: Apr 19, 2024 | 11:40 AM

Share

ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. ఇదిలా ఉంటే గుండెపోటు వచ్చే సమయంలో చాలా మంది బాత్‌రూమ్‌లలో ఉంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంతకీ బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో గుండె పోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది.? దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదిక కూడా 11 శాతం కంటే ఎక్కువ గుండెపోటు కేసులు బాత్రూమ్‌లో సంభవిస్తున్నాయని పేర్కొంది. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వంటి కేసుల్లో చాలా వరకు ప్రేగు కదలిక లేదా మూత్రవిసర్జన సమయంలో సంభవిస్తాయి.

బలబద్ధకంతో ఇబ్బంది పడే వారు విసర్జన సమయంలో ఎక్కువ శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది ఇది రక్తపోటు తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అసమతుల్యత కారణంగా, మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది, దీంతో ఇది అపస్మారక స్థితికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాత్‌రూమ్‌లో ఏదైనా జరిగితే బయటి వ్యక్తులకు తెలియడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ మరణాలు సంభవించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు.

ఇక స్నానం చేసే సమయంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బాగా చల్లటి నీరు లేదా వేడి నీరుతో స్నానం చేయడం వల్ల హృదయ స్పందన రేటు ప్రభావితమవుతుంది. బాగా చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని రక్తమంతా మెదడుకు చేరుతుంది. ఇది రక్త నాళాలు, ధమనులలో ఉద్రిక్తతను పెంచుతుంది. దీంతో హృద్రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే మరీ వేడి నీరు కాకుండా మరీ చల్లటి నీరు కాకుండా స్నానం చేయాలి. అలాగే తలపై ఒకేసారి నీరు పోయకుండా క్రమంగా పోస్తుండాలి. గతంలో గుండెపోటు వచ్చిన వారు, బీపీ పేషెంట్స్‌, వృద్ధులు బాత్‌రూమ్‌ ఉపయోగించే సమయంలో డోర్‌ మూయకుండా ఉండడమే ఉత్తమం అని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!