శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసిన సూర్యుడు..! అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. పులకించిపోయిన భక్తజనం..

సూర్య తిలకం రామ్‌లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్‌ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రాంలాలా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది. ఏకంగా ఆ సూర్యభగవానుడే.. రాంలాలాకు అభిషేకం చేసిన ఆ పూర్వ ఘట్టాన్ని యావ్‌ దేశం కన్నులారా తిలకించి పులకించిపోయింది.

శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసిన సూర్యుడు..! అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. పులకించిపోయిన భక్తజనం..
Ram Lalla Surya Tilak
Follow us

|

Updated on: Apr 17, 2024 | 12:45 PM

దేశవ్యాప్తంగా రామనవమి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈసారి రామనవమికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత రాంలాలాకు ఇది మొదటి రామనవమి. ఈ సందర్భంగా రాంలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకంగా ఆ సూర్యభగవానుడే.. రాంలాలాకు అభిషేకం చేశాడు..ఆ పూర్వ ఘట్టాన్ని యావ్‌ దేశం కన్నులారా తిలకించి పులకించిపోయింది. ఆలయ నిర్మాణంలో భాగంగా అద్బుతమైన టెక్నాలజీ సాయంతో రూపొందించిన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. సూర్య తిలకం రామ్‌లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్‌ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రాంలాలా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది. రామాలయంలో జరుగుతున్న రామనవమి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారం కూడా జరిగింది.

రామనవమి సందర్భంగా రామమందిరానికి ప్రత్యేక అలంకరణ చేశారు. రామ నవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటలకు రామాలయం తలుపులు తెరిచారు. రాత్రి 11 గంటల వరకు భక్తులు రాంలాల దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

ఇవి కూడా చదవండి

శ్రీరామనవమి పండుగ ప్రత్యక్ష ప్రసారానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ రామ్ టెంపుల్ వద్ద రామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారం కోసం అయోధ్య అంతటా సుమారు 100 LED స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు, దానిపై భక్తులు రామనవమి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇది కాకుండా, YouTube తో సహా ట్రస్ట్ యొక్క X ఖాతాలో ప్రత్యక్ష ప్రసారం కూడా జరిగింది.

ఇకపోతే, ట్రస్ట్ జారీ చేసిన నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి..

– ఏప్రిల్ 16-18 మధ్య రాంలాలా దర్శనం, హారతి కోసం ప్రత్యేక పాస్ బుకింగ్ రద్దు చేయబడింది.

– రామ మందిరంలోకి ప్రవేశించేందుకు భక్తులందరూ ఇతర భక్తుల మాదిరిగానే (వీఐపీ భక్తులు సైతం) నిబంధనలను పాటించాలి.

– ఈరోజు భక్తులు రాత్రి 11 గంటల వరకు రామాలయానికి వచ్చి రాంలాల దర్శనం చేసుకోవచ్చు.

– ఈరోజు రాంలాలా ఆలయం దాదాపు 20 గంటల పాటు భక్తుల కోసం తెరిచి ఉంటుంది.

– దర్శన సమయంలో భక్తులు తమ మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు తీసుకురావద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..