Watch Video: ఓరీ మీ దుంపతెగ.. అక్కడ ఎలా పెట్టార్రా..!! స్కాన్ చేస్తే కప్పు నిండుతుంది

కొంతమంది చాయ్‌ లవర్స్‌ కూడా ఉంటారు. వారు ఎక్కడికి వెళితే.. అక్కడికి తమ వెంట కెటిల్, ఒక కప్పు టీ అంటిపట్టుకుని వెళ్తుంటారు. అలాంటి ఒక టీ ప్రియుడు తన బైక్‌లో టీ మెషీన్‌ను అమర్చాడు. ఆ మిషన్‌ పనిచేస్తున్న తీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. బైక్‌లో అమర్చిన యంత్రంలోంచి అతడు కొరుకున్నప్పడు టీ కప్పులో పడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: ఓరీ మీ దుంపతెగ.. అక్కడ ఎలా పెట్టార్రా..!! స్కాన్ చేస్తే కప్పు నిండుతుంది
Bike Can Get Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 17, 2024 | 11:39 AM

మన దేశంలో టి ప్రియులు చాలా మంది ఉన్నారు. సంతోషమైనా, ఒత్తిడిలోనైనా టీ తప్పనిసరి అవసరం. రోజు ప్రారంభంలో ఉదయాన్నే కప్పు కాఫీ, లేద టీ కడుపులో పడాల్సిందే. అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారికి ఒక కప్పు టీ తప్పనిసరి అవసరం. కొంతమంది చాయ్‌ లవర్స్‌ కూడా ఉంటారు. వారు ఎక్కడికి వెళితే.. అక్కడికి తమ వెంట కెటిల్, ఒక కప్పు టీ అంటిపట్టుకుని వెళ్తుంటారు. అలాంటి ఒక టీ ప్రియుడు తన బైక్‌లో టీ మెషీన్‌ను అమర్చాడు. ఆ మిషన్‌ పనిచేస్తున్న తీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. బైక్‌లో అమర్చిన యంత్రంలోంచి అతడు కొరుకున్నప్పడు టీ కప్పులో పడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆఫీస్‌లో టీ, కాఫీ కోసం ఒక మెషిన్ ఉంటుంది. అది బటన్ నొక్కితే మనకు కావాల్సిన టీ, కాఫీని అందజేస్తుందని మనందరికీ తెలుసు. కానీ, ఇక్కడో యువకుడు తయారు చేసిన మెషీన్‌ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అతడు తన బైక్‌లోనే టీ మెషీన్‌ను ఏర్పాటు చేశాడు. వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌లో టీ యంత్రాన్ని అమర్చిపెట్టాడు. ఈ యంత్రం మీకు కావలసినప్పుడు టీని తయారు చేస్తుంది. వీడియోలో చూపిన విధంగా ఆ వ్యక్తి తన బైక్ నంబర్ ప్లేట్ పైన క్యూఆర్ కోడ్‌ కలిగిన బోర్డును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అతడు తన మొబైల్‌ని తీసి బైక్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేశాడు. ఇలా చేయడంతో బైక్ పై ఉన్న క్యూఆర్ బోర్డు తెరుచుకోవడంతో వేడి వేడి టీ బయటకు వస్తుంది. యువకుడి ఈ అద్వితీయమైన ట్రిక్‌ ఎలా ఉందో మీరూ ఒకసారి చూసేయండి..

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. చాలా మందిని ఆలోచించేలా చేస్తుంది. వాహనం నంబర్ ప్లేట్‌పై హర్యానా నంబర్ కనిపిస్తుంది. అలాగే ఈ గేమ్‌ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దూర ప్రయాణాల్లో కనుచూపుమేరలో టీ దుకాణం లేనప్పుడు టీ ప్రియులకు ఈ బైక్ వరం లాంటిదని కొందరు కామెంట్స్ రాసుకొచ్చారు. ఈ వీడియో Instagram ఖాతా @theadultshit నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా, నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకుముందు, ఈ యువకుడు నంబర్ ప్లేట్ దగ్గర ప్లేట్‌పై సూచికను ఉంచడం ద్వారా ప్రమాదాల నివారణకు ఒక పరిష్కారాన్ని చూపించాడు. ఇప్పుడు కూడా అతడే, ఇలా సుదీర్ఘ ప్రయాణంలో టీ తాగడానికి ఒక ప్రత్యేకమైన ట్రిక్‌ని కనుగొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..