AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..

అలాగే చాలా మంది రాత్రిపూట స్నానం చేయడానికి ఇష్టపడతారు. దానికి కారణం మంచి నిద్రకోసం. పడుకునే ముందు మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు, రాత్రిపూట చన్నీళ్ల స్నానం చేయడం మీ మంచి నిద్రకు సహజమైన ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసిన వెంటనే మీరు స్నానం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత..

Health Tips: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..
Bath
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2024 | 10:26 AM

Share

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేయడం చాలా ముఖ్యం. అందుకే ప్రజల దినచర్యలో స్నానం ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. స్నానం శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే, కొందరు ఉదయం స్నానం చేస్తారు.. మరికొందరు రాత్రిపూట స్నానం చేస్తుంటారు. అయితే, ఏ టైమ్‌లో స్నానం చేయటం మంచిదో మీకు తెలుసా..? ఉదయం, లేదా రాత్రి ఏ టైమ్‌లో స్నానం చేస్తే మంచిదో తెలసా.? ఇది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎప్పుడైన ఆలోచించారా..? ఎన్నో యేళ్లుగా ఈ స్నాన సమయాల మీద తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనేక శాస్త్రీయ ఆధారాల ఆధారంగా స్నాన సమయాలు, అలవాట్లకు సంబంధించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. అవేంటో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం స్నానం నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా..?

ఆయుర్వేదంలో ఉదయాన్నే తలస్నానం చేయడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేస్తే మంచిదని అంటున్నారు. వ్యాయామం తర్వాత శరీరం అలసిపోతుంది, స్నానం శరీరానికి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్త మయానికి ముందు స్నానం చేయడం మంచిదని అంటున్నారు. రాత్రిపూట నిద్రలో బ్యాక్టీరియా, చనిపోయిన చర్మ కణాలు షీట్లు లేదా చర్మంపై పేరుకుపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అవన్నీ తొలగిపోతాయి.  అంతే కాకుండా ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల సోమరితనం కూడా దూరం అవుతుందని అంటున్నారు. వ్యాయామం చేసిన వెంటనే మీ దినచర్యలో స్నానం చేయాలి. వ్యాయామం తర్వాత శరీరం అలసిపోయినందున స్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. సూర్యోదయం లేదా సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం ఉత్తమమైనదిగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం స్నానం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రాత్రిపూట స్నానం చేయడం వల్ల వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం పెరిగి రక్తపోటు సరిగ్గా ఉంటుంది. ఇది గాఢ నిద్రకు కూడా సహాయపడుతుంది. ఒత్తిడిని చాలా దూరంగా ఉంచవచ్చు. రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల రోజంతా చర్మంపై పేరుకుపోయిన మురికి, క్రిములు తొలగిపోతాయి. మీ పరుపు శుభ్రంగా, సూక్ష్మక్రిములు లేకుండా ఉంటుంది. తద్వారా మీరు ఆరోగ్యకరమైన నిద్రను పొందగలరు. ఇది వ్యాధుల ప్రమాదాన్ని నిరోధించదు. కానీ, మీకు లేదా మీతో నివసించే వ్యక్తులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, బయటి నుండి వచ్చిన తర్వాత స్నానం చేయడం అవసరం. అయితే, రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల జుట్టు సరిగా ఆరదు.. దాంతో మైయోసైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, రాత్రి పూట తలస్నానం చేయడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

తామర వంటి చర్మ సమస్యలతో బాధపడేవారికి రాత్రిపూట స్నానం చేయడం మంచిది. వాతావరణ కాలుష్యం, దానిలోని కొన్ని హానికరమైన అంశాలు చర్మ సంబంధిత వ్యాధుల పెరుగుదలకు దారితీస్తాయి. రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ చర్మం వాటి నుండి బయటపడుతుంది. అదనంగా పొడి చర్మం ఉన్నవారు లేదా ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు ఉన్నవారు రోజువారీ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. కానీ ప్రతిరోజూ చేయడం కొంచెం ఎక్కువ శ్రమతో కూడుకున్నది. అలాంటి సందర్భాలలో రాత్రి స్నానం చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే చాలా మంది రాత్రిపూట స్నానం చేయడానికి ఇష్టపడతారు. దానికి కారణం మంచి నిద్రకోసం. పడుకునే ముందు మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు, రాత్రిపూట చన్నీళ్ల స్నానం చేయడం మీ మంచి నిద్రకు సహజమైన ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసిన వెంటనే మీరు స్నానం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఒకటి నుండి రెండు గంటల తరువాత స్నానం చేయాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు స్నానం చేస్తే కూడా మంచిదే అంటున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..