AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న 22ఏళ్ల యువతి.. ఒంటరిగా పాడుబడిన భవనంలోకి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూసి అంతా షాక్‌..

పోలీసు విచారణ సమయంలో ఒక సాక్షి తాను ఆ అమ్మాయిని పాడుబడిన, పురాతన భవనం చుట్టుపక్కల చూశానని చెప్పాడు. ఇద్దరూ పిశాచాల వేషధారణలో ఉన్నారని చెప్పాడు.. ఆ అమ్మాయి నడిచే శవంలా కనిపించదని చెప్పారు. సాక్షులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు అనుమానం మరింత బలపడింది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు వేగం చేశారు.

టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న 22ఏళ్ల యువతి.. ఒంటరిగా పాడుబడిన భవనంలోకి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూసి అంతా షాక్‌..
Ghost Hunting Tiktok Challenge
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2024 | 8:06 AM

Share

మన దేశంలో బ్యాన్‌ చేసిన టిక్‌టాక్‌ ఇతర దేశాల్లో ప్రజలను పట్టి పీడిస్తోంది. టిక్ టాక్ పిచ్చిలో యువతీ యువకులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.  22 ఏళ్ల అమ్మాయి దారుణమైన స్థితిలో మరణించింది. ఆమె చనిపోయిన తీరు తెలిసి అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. మృతురాలు టిక్‌టాక్ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు నిర్జన చర్చిలోకి వెళ్లినట్టుగా తెలిసింది. ఆ మరుసటి రోజే ఆ యువతి మృతదేహం కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు. టిక్‌టాక్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న 22 ఏళ్ల అమ్మాయికి ఏం జరిగిందో తెలిసి ప్రజలతో పాటు పోలీసులు కూడా షాక్ అయ్యారు. టిక్‌టాక్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన ఈ అమ్మాయి రాత్రిపూట ఒంటరిగా నిర్జన చర్చిలోకి వెళ్లిందని చెబుతున్నారు. మరుసటి రోజున ఆమె శరీరం రక్తపు మడుగులో పడివుంది. శరీరంపై బుల్లెట్ గాయాలు, పదునైన కత్తితో దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. మృతదేహాన్ని చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టిక్‌టాక్ ‘ఘోస్ట్ హంటింగ్’ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఫ్రెంచ్ అమ్మాయి ఆరియన్ నథాలీ లైస్నే అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహం దొరికిన చర్చి చాలా పాతదని, ఇక్కడికి ఎవరూ రావటం లేదని, ప్రస్తుతం నిరుపయోగంగా పాడుబడిన స్థితిలో ఉందని చెప్పారు. ఆరియన్ తన మరణానికి ముందు తన 21 ఏళ్ల ప్రియుడు టీమా సోహైబ్‌పై గృహ హింస కేసును నమోదు చేసింది. యువతికి దూరంగా ఉండాలని కోర్టు టీమాను కూడా ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఛాలెంజ్‌ సాకుతో ప్రియుడు బాలికను నిర్జన ప్రదేశానికి పిలిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసు విచారణ సమయంలో ఒక సాక్షి తాను ఆ అమ్మాయిని పాడుబడిన, పురాతన భవనం చుట్టుపక్కల చూశానని చెప్పాడు. ఇద్దరూ పిశాచాల వేషధారణలో ఉన్నారని చెప్పాడు.. ఆ అమ్మాయి నడిచే శవంలా కనిపించదని చెప్పారు. సాక్షులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు అనుమానం మరింత బలపడింది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. దాంతో బాయ్‌ఫ్రెండ్ టీమాను ఇటాలియన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. యువతి శరీరంపై పలుమార్లు కత్తిపోట్లకు గురైందని, దీంతో రక్తస్రావం ఎక్కువై చనిపోయిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. అదే సమయంలో మరణం తరువాత, శరీరంలో బుల్లెట్ దూసుకుపోయిందని రిపోర్ట్‌లో తేలింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నరబలి కోసం యువతి ప్రాణాలు తీశారా..? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..