AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. భద్రాద్రి రామయ్య సేవలో తెలంగాణ మంత్రులు..

దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో.. సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చలహారంతో.. సీతారాములు మెరిసిపోయారు. మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల నడుమ రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది. వేదమత్రోచ్ఛరణలు, రామనామ స్మరణతో మిథిలా స్టేడియం మార్మోగిపోయింది. ముందుగా.. సీతా సమేతంగా రాముల వారిని ప్రత్యేక పల్లకీలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి పల్లకిపై మేళ తాళాలతో కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు.

కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. భద్రాద్రి రామయ్య సేవలో తెలంగాణ మంత్రులు..
Bhadrachalam Sitarama Kalya
Srikar T
|

Updated on: Apr 17, 2024 | 1:18 PM

Share

దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో.. సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చలహారంతో.. సీతారాములు మెరిసిపోయారు. మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల నడుమ రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది. వేదమత్రోచ్ఛరణలు, రామనామ స్మరణతో మిథిలా స్టేడియం మార్మోగిపోయింది. ముందుగా.. సీతా సమేతంగా రాముల వారిని ప్రత్యేక పల్లకీలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి పల్లకిపై మేళ తాళాలతో కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత.. కళ్యాణ క్రతువు పూర్తి చేసి.. అభిజిత్ లగ్నంలో సీతమ్మపై జీలకర్ర బెల్లం పెట్టించారు పూజారులు. ఆ వెంటనే.. సీతమ్మకు.. రామదాసు చేయించిన తాళిబొట్టును భక్తులందరికీ చూపించారు. రాములోరి చేతి దగ్గర ఉంచి మాంగళ్యధారణ చేయించారు. ఏడాదికోసారి జరిగే అద్భుతఘట్టం ఇది. రాములోరి కళ్యాణం చూసి భక్తులంతా పులకించిపోయారు. కొలిచిన వారి కొంగుబంగారంగా ప్రతీతి ఉన్న భద్రాద్రి రామయ్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు రామనామాన్ని స్మరించారు. కళ్యాణ వేదిక ప్రాంగణమంతా భక్తుల జయజయ నినాదాలతో, గోవింద నామస్మరణతో మార్మొగిపోయింది.

సాధారణంగా భద్రాచలం రామయ్యకు ప్రతి ఏటా శ్రీరామ నవమికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ కారణంగా ఈసారి సీఎస్ శాంతికుమారి.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాములోరి కళ్యాణ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకుండా.. సామాన్య భక్తుల్లా రాములోరి కళ్యాణం తిలకించారు. సీతారాముల కల్యాణం పూర్తి కావడంతో.. భక్తులకు రాములోరి తలంబ్రాలను పంచుతున్నారు. ఇందుకోసం ఐదు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. అలాగే రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ముత్యాల తలంబ్రాలను, లడ్డూలను అందించడానికి భద్రాచలంలో 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు.