మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! ఇలా వాడితే మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది..?

మోదుగ చెట్టు.. త్రిమూర్తులకు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నివాసంగా పరిగణిస్తారు. మోదుగ పువ్వుల అందం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి మోదుగ పువ్వులు యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! ఇలా వాడితే మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది..?
Palash Flower
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 19, 2024 | 10:04 AM

డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ వ్యాధి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి పెద్ద ముప్పుగా ఉద్భవించింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ తీవ్రమైన వ్యాధి బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయమేమిటంటే మధుమేహానికి మందు లేదు. అటువంటి పరిస్థితిలో బాధితుడు తన జీవితాంతం మందులపై ఆధారపడవలసి ఉంటుంది. ఒక్కసారి మధుమేహం వస్తే దాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చుకోవడం ద్వారా మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు.

అయితే, ఆయుర్వేదంలో సూచించిన అనేక మూలికలు బ్లడ్‌ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయని సూచించారు. వీటిని తీసుకోవడం ద్వారా ఈ తీవ్రమైన వ్యాధిని చాలా వరకు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. వీటిలో ఒకటి మోదుగ పువ్వు. ఈ పువ్వులతో చేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది.

మోదుగ చెట్టు.. త్రిమూర్తులకు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నివాసంగా పరిగణిస్తారు. మోదుగ పువ్వుల అందం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి మోదుగ పువ్వులు యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం రెండు మోదుగ పువ్వులను తీసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి.. ఒక బౌల్‌లో 2 కప్పుల నీటిని మరిగించాలి. గ్యాస్‌ను ఆపివేసి, ఈ పువ్వులను వేడి నీటిలో వేయండి. ఆ తరువాత దానిపై మూతపెట్టి ఒక రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని వడకట్టి తాగేయాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగుతూ ఉంటే.. బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మోదుగ పువ్వులలో యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలుఉన్నాయి. కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతే కాకుండా వీటిని పౌడర్‌గా చేసుకుని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపడుతుంది. ఇందుకోసం మోదుగ పువ్వులను ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ పువ్వుల చూర్ణం కలిపి ఒక కప్పు కషాయాన్ని మరిగించి వడబోసి ఉదయం పరగడపున, రాత్రి భోజనానికి ముందు తాగాలి. ఆకుల చూర్ణాన్ని కూడా ఇలాగే వాడుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మోదుగపూల మిశ్రమం అతిమూత్రం, మధుమేహాల్ని అదుపుచేస్తుందని చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!