Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్సర్, పేగు సమస్యలా.. వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ మీ కోసం..

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మన పూర్వీకుల జీవన విధానం ఆహారపు అలవాట్లు మనవారిని మాత్రమే కాదు విదేశీయులను మాత్రం ఆకర్షించడం మొదలు పెట్టాయి. అలాంటి ఆహారంలో ఒకటి చద్దన్నం.. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ రాత్రి మిగిలిన ఆహారాన్ని పొద్దున్న పెరుగుతో లేదా .. రాత్రి పాలలో అన్నం వేసి తోడు పెట్టి మర్నాడు చద్దన్నంగా తినేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారని పలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మళ్ళీ వేసవి వస్తే చాలు చద్దన్నం వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే కొందరు దీనిని రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. ఈ రోజు అమ్మమ్మ కాలం నాటి పెరుగు చద్దన్నం రెసిపీ తెలుసుకుందాం.. 

అల్సర్, పేగు సమస్యలా.. వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ మీ కోసం..
Perugu Chaddannam Recipe
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 24, 2024 | 2:38 PM

మారిన జీవన విధానం ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. మన సాంప్రదాయ ఆహారాలను పక్కకు పెట్టి పిజ్జా, బర్గర్స్, మోమోస్ వంటి రకరకాల ఆహారాలను ఇష్టంగా తింటారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మన పూర్వీకుల జీవన విధానం ఆహారపు అలవాట్లు మనవారిని మాత్రమే కాదు విదేశీయులను మాత్రం ఆకర్షించడం మొదలు పెట్టాయి. అలాంటి ఆహారంలో ఒకటి చద్దన్నం.. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ రాత్రి మిగిలిన ఆహారాన్ని పొద్దున్న పెరుగుతో లేదా .. రాత్రి పాలలో అన్నం వేసి తోడు పెట్టి మర్నాడు చద్దన్నంగా తినేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారని పలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మళ్ళీ వేసవి వస్తే చాలు చద్దన్నం వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే కొందరు దీనిని రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. ఈ రోజు అమ్మమ్మ కాలం నాటి పెరుగు చద్దన్నం రెసిపీ తెలుసుకుందాం..

పెరుగు చద్దన్నం తయారీకి కావలసిన పదార్థాలు:

మరిగించిన పాలు – పావు లీటరు

అన్నం – రెండు కప్పులు

ఇవి కూడా చదవండి

పోపు కోసం కావాల్సిన పదార్ధాలు

ఉల్లి పాయ ముక్కలు

పచ్చి మిర్చి  తరుగు

ఆవాలు

జీలకర్ర

పసుపు

కొత్తిమీర

కరివేపాకు

అల్లం ముక్కలు

ఉప్పు రుచికి సరిపడా

కొంచెం నెయ్యి లేదా నూనె

నిమ్మరసం

తయారీ విధానం: చద్దన్నం తయారీకి ముందుగా గిన్నెలో పాలను తీసుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ పాలలో అన్నం వేసి అందులో కొంచెం తోడు వేసుకోవాలి. మర్నాడు ఉదయం పెరుగు అన్నం తీసుకుని అందులో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలి తీసుకుని అందులో కొంచెం నెయ్యి లేదా నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం ముక్కలు వేసి వేగిన తర్వాత రెడీ చేసుకున్న పెరుగు అన్నంలో ఈ పోపుని వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. అంతే అమ్మమ్మ కాలం నాటి పెరుగు చద్దన్నం రెడీ.. దీనిలో ఆవకాయ, పచ్చి మిర్చి , ఉల్లిపాయ, దానిమ్మ గింజలను నంజుకుని తింటే ఆహ ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..

పెరుగు చద్దన్నం తినడం వలన ఉపయోగాలు

  1. శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
  2. చర్మ వ్యాదుల నుంచి చద్దన్నం రక్షణ ఇస్తుంది
  3. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది
  4. జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  5. అల్సర్లూ పేగు సమస్యలు ఉన్నవారికి పరమౌషధం
  6.  బీపీ, మలబద్ధకం తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..