దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న అనంత్ అంబానీ.. రెండు ఆలయాలకు రూ. 5 కోట్లు విరాళం..

అంబానీ కుటుంబానికి హిందూ మతం అంటే విశ్వాసం,  దేవాలయాల పట్ల గొప్ప గౌరవం ఉంది. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ తరచుగా దేశంలో ఉన్న అనేక దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంవత్సరం అంబానీ కుటుంబం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 14 కొత్త దేవాలయాల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించింది. తాజగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు కాబోయే పెళ్లి కొడుకు అనంత్ అంబానీ చైత్ర నవరాత్రి అష్టమి రోజున ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయాన్ని, అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు.

దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న అనంత్ అంబానీ.. రెండు ఆలయాలకు రూ. 5 కోట్లు విరాళం..
Anant Ambani
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:20 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఇటీవల భారతదేశంలోని రెండు ప్రధాన ఆలయాలను సందర్శించి ఒక్కో ఆలయానికి రూ.2,51,00,000 చొప్పున చెల్లించారు. అంటే మొత్తం రూ.5 కోట్ల విరాళంగా అందించారు. అంబానీ కుటుంబానికి హిందూ మతం అంటే విశ్వాసం,  దేవాలయాల పట్ల గొప్ప గౌరవం ఉంది. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ తరచుగా దేశంలో ఉన్న అనేక దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంవత్సరం అంబానీ కుటుంబం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 14 కొత్త దేవాలయాల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించింది.

తాజగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు కాబోయే పెళ్లి కొడుకు అనంత్ అంబానీ చైత్ర నవరాత్రి అష్టమి రోజున ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయాన్ని, అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఒక్కో ఆలయానికి 2,51,00,000. అంటే మొత్తం రూ.5 కోట్ల విరాళం అందింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by POP Diaries (@ipopdiaries)

ఇటీవల జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అంతేకాదు వీరి వివాహం జూలైలో జరగనుంది.

అయితే తాను అంబానీ ఫ్యామిలీకి చెందిన వారసుడినైనా తన జీవితం పూర్తిగా పూలపాన్పు కాదని.. ఎన్నో బాధలను అనుభవించానని ఒకానొక సందర్భంలో చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఎదిగిన తనకు తన తల్లిదండ్రులు అండగా నిలిచినట్లు చెప్పాడు.. అంతేకాదు జంతువులు అంటే ఇష్టం అని చెప్పిన అనంత్ అంబానీ జూ పార్క్ కి భారీగా విరాళం కూడా అందిస్తున్నట్లు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..