AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్నీ.. నల్లత్రాచును సెకన్ల వ్యవధిలో ఎలా బంధించాడో చూడండి.. మీరు గ్రేట్ సార్

పాముల్ని జాగ్రత్తగా బంధించడం కూడా ఒక ఆర్ట్. కొంచెం తేడా వచ్చినా.. ప్రాణాలు పోతాయి. అయితే ఓ అంకుల్ చాలా ఈజీగా తక్కువ సమయంలోనే ఓ ప్రమాదకర నల్ల త్రాచను బంధించాడు. అది కాటు వేసేందుకు ముందుకు దూసుకువస్తున్నా అదరలేదు.. బెదరలేదు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: ఓర్నీ.. నల్లత్రాచును సెకన్ల వ్యవధిలో ఎలా బంధించాడో చూడండి.. మీరు గ్రేట్ సార్
Snake Catcher
Ram Naramaneni
|

Updated on: Apr 18, 2024 | 4:44 PM

Share

పాములను రెస్క్యూ చేయడం ఒక ఆర్ట్. అగ్రెసీవ్‌గా ఉండే  త్రాచుపాము లాంటి వాటిని ఎలా డీల్ చేయాలో తెలిసి ఉండాలి. లేదంటే కాటు పడుద్ది.. ప్రాణం ప్రమాదంలో పడుద్ది. సరదా కోసం, సెల్పీల కోసం పాములతో ఎక్స్ ట్రాలు చేస్తే.. ఫోటోలకు దండ పడటం ఖాయం. బాగా అలవాటు పడిన వారు, పాములు పట్టడంలో ఆరితేరిన పాము.. ఎంత పెద్ద, ప్రమాదకర పామునైనా అలవోకగా పట్టేస్తారు. తాజాగా ఓ వ్యక్తి సెకన్ల వ్యవధిలో పడగ విప్పిన.. నల్లత్రాచును ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అది రెండు, మూడు సార్లు కాటు వేసేందుకు యత్నించినా వెనక్కి తగ్గలేదు. ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అనే పేజీ ద్వారా X లో పోస్ట్ చేయబడిన చిన్న క్లిప్, ఇప్పటివరకు దాదాపు 3 మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ముందు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

వీడియోను గమనిస్తే.. స్నేక్ క్యాచర్ పామును పట్టేందుకు ఓ ప్లాస్టిక్ డబ్బాతో సిద్ధంగా ఉన్నాడు. నేను చిక్కను అన్నట్లుగా నల్లత్రాచు కూడా పడగవిప్పి తనను తాను రక్షించుకునేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలో పట్టుకునేందుకు ప్రయత్నించగా  2 సార్లు కాటు వేయడానికి ముందుకు దూకింది. ఆ తర్వాత డబ్బాలోకి వెళ్లి మరీ ఒకసారి తప్పించుకుంది. రెండోసారి ఈజీగానే ఆయన దాన్ని బంధించారు. ఈ వీడియోపై నెటిజన్లపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఎన్ని పాములు పట్టిన ఎక్స్‌పీరియన్స్ సార్ మీది.. ఇంత ‘ప్రొ’లా ఉన్నారు అని ఓ యూజర్ పేర్కొన్నాడు. మీరు స్నేక్ మ్యాన్ అని మరొకరు కామెంట్స్ పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..