AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

104 ఏళ్ల బామ్మని ప్రేమించి 11 ఏళ్లు సహజీవనం చేసిన 48 ఏళ్ల వ్యక్తి.. వింత ప్రేమకు ఎండ్ కార్డ్.

ఎస్టోనియాలో నివసిస్తున్నప్పటికీ మార్ట్.. ఆస్ట్రేలియా తరచుగా వెళ్లి.. ఆల్ఫ్రెడో రిట్ ను కలిసేవాడు. అయితే ఎస్టోనియాలో జన్మించిన ఎల్ఫ్రీడ్ మార్ట్ కి ఆల్ఫ్రెడో రిట్ సవతి అమ్మమ్మ అని తెలిస్తే ఎవరైనా  ఆశ్చర్యపోతారు. మార్ట్ కు తన దాదాతో సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత ఆల్ఫ్రెడో రిట్ ఆస్ట్రేలియా వెళ్లింది. తన తాత చనిపోయాక ఆల్ఫ్రెడో రిట్ తో 11 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మార్ట్ ఇటీవల మీడియాతో చెప్పాడు. 2022 వరకు కలిసి ఉన్నామని చెప్పాడు.  

104 ఏళ్ల బామ్మని ప్రేమించి 11 ఏళ్లు సహజీవనం చేసిన 48 ఏళ్ల వ్యక్తి.. వింత ప్రేమకు ఎండ్ కార్డ్.
Unique Love Story
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2024 | 3:56 PM

ప్రస్తుతం ప్రేమ ఎల్లలు దాటింది. తమకు నచ్చిన మనసు మెచ్చిన వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రేమ గుడ్డిది అని అంటారు. తాజాగా ఓ వ్యక్తి తనకంటే 58 ఏళ్లు పెద్దదైన స్త్రీతో గాఢమైన ప్రేమలో పడేంత గుడ్డిది. ఐరోపా దేశమైన ఎస్టోనియాకు చెందిన 48 ఏళ్ల మార్ట్ సూసన్ ఆస్ట్రేలియాకు చెందిన 104 ఏళ్ల ఆల్ఫ్రెడో రిట్ పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అతను బామ్మను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఈ ప్రేమ పక్షులు కలిసి జీవించి కలిసి మరణిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఒకరితోడుగా ఒకరు జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ వింత ప్రేమకథపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే ఈ విలక్షణమైన ప్రేమకథకు తెరపడింది. ఎందుకంటే గత శనివారం ఆల్ఫ్రెడో ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికింది. మార్క్, ఆల్ఫ్రెడో ప్రేమ కథ గురించి తెలిసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. మరి వీరిద్దరూ ఎలా కలిశారు అనేది తెలుసుకుందాం.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన మార్క్ తాను ఆంగ్లం నేర్చుకునేందుకు ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు  తొలిసారిగా ఆల్ఫ్రెడోను కలిశానని చెప్పాడు. ఆల్ఫ్రెడో రిట్ ను చూడగానే ప్రేమలో పడ్డానని చెప్పాడు. తమ వయసు తేడా తనకు బాగా తెలుసని .. అయినా సరే తాను ఆమె ప్రేమ నుంచి బయటకు రాలేకపోయానని  మార్ట్ చెప్పాడు. ఎస్టోనియాలో నివసిస్తున్నప్పటికీ మార్ట్.. ఆస్ట్రేలియా తరచుగా వెళ్లి.. ఆల్ఫ్రెడో రిట్ ను కలిసేవాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఎస్టోనియాలో జన్మించిన ఎల్ఫ్రీడ్ మార్ట్ కి ఆల్ఫ్రెడో రిట్ సవతి అమ్మమ్మ అని తెలిస్తే ఎవరైనా  ఆశ్చర్యపోతారు. మార్ట్ కు తన దాదాతో సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత ఆల్ఫ్రెడో రిట్ ఆస్ట్రేలియా వెళ్లింది. తన తాత చనిపోయాక ఆల్ఫ్రెడో రిట్ తో 11 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మార్ట్ ఇటీవల మీడియాతో చెప్పాడు. 2022 వరకు కలిసి ఉన్నామని చెప్పాడు.

ఆల్ఫ్రెడో రిట్ లేని తన జీవితం అసంపూర్ణం అని మార్ట్ చెప్పాడు. మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేకపోయినా.. భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషనల్ రిలేషన్ షిప్ ఉండేది. మార్ట్ లా ప్రాక్టీస్ వదిలి ఆల్ఫ్రెడో రిట్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. అతను 2018లో శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది తిరస్కరించబడింది. ఎందుకంటే.. మార్ట్ తాను ఆల్ఫ్రెడో రిట్ భాగస్వామి అని కోర్టులో నిరూపించలేకపోయాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..