Viral Video: రాయి కింద కనిపించిన పెద్ద మట్టి పాత్ర.. ఓపెన్ చేయగా పాము, పురాతన నిధి.. ఇది విషయం

పురాతన నిధి, నిక్షేపాలు దొరికిన సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. తవ్వకాలు జరపుతుండగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో కూలీలు, జనాలు ఎక్కువమంది ఉంటారు కాబట్టి.. విషయం బయటకు పొక్కుతూనే ఉంటుంది. తాజాగా నిధి వేటగాళ్లు అపార నిధిని కనిపెట్టారన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: రాయి కింద కనిపించిన పెద్ద మట్టి పాత్ర.. ఓపెన్ చేయగా పాము, పురాతన నిధి.. ఇది విషయం
Treasure Viral Video
Follow us

|

Updated on: Apr 18, 2024 | 3:27 PM

తవ్వకాలు జరుపుతుండగా, భూమి దున్నుతుండగా, పాత ఇళ్లు, కట్టడాలను కూల్చివేస్తుండగా.. పురాతన కాలాలకు చెందిన నిధి, నిక్షేపాలు బయటపడిన ఘటనలు అరుదుగా చూస్తుంటాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనల గురించి అడపా దడపా వింటూనే ఉంటాం. అంతెందుకు… ఇటీవల సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో 2 వేల ఏళ్ల కిందటి సీసపు నాణేలు బయటపడ్డాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకునేందుకు.. అందుకు సంబంధించిన వీడియోలను చూసేందుకు జనాల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అయితే కొందరి వ్యూస్ పొందేందుకు తప్పుడు వార్తలను, వీడియోలను సర్కులేట్ చేస్తున్నారు.

ప్రజంట్ సోషల్ మీడియా శకం నడుస్తోంది. పందిని నంది.. నందిని పంది చేస్తున్నారు. మనం నిజమే అని నమ్మితే మోసపోవడం ఖాయం. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో విషయానికి వస్తే… నిధి వేటగాళ్లు ఒక ప్లేసులో ఒక పెద్ద రాయి కింద నిధి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రాయిని ట్రాక్టర్ సాయంతో.. పక్కకు లాగారు. ఆ రాయి కింది కుండ లాంటి పాత్ర ఉంది. ఆత్రుతతో దాన్ని ఓపెన్ చేయగా.. బతికున్న పాముతో పాటు పెద్ద ఎత్తున నిధి కనిపించింది. ఆ పాము వెంటనే ఆ పాత్ర నుంచి పక్కకు వెళ్లిపోయింది. పామును తొలగించిన తర్వాత, వ్యక్తి కుండలో నుండి నిధిని తీయడం కనిపిస్తుంది. కుండలో బంగారు నాణేలు, ఇతర వస్తువులు కనిపించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫెలెజియాబీ అనే వినియోగదారు ఈ వీడియోను పోస్ట్ చేశారు.

పిచ్చి తనమో, వెర్రి తనమో కాకపోతే.. అంత బండ రాయి కింద.. ఒక మూసి వేసి ఉన్న జార్‌లో అంతకాలం పాము ఎలా బతికి ఉండగలుగుతుంది చెప్పండి. ఇది పక్కాగా ఫేక్ వీడియో. కానీ నిజమైన వీడియోలా అలా క్రియేట్ చేసి.. వైరల్ చేశారు. కొంతమంది తెలియని వాళ్లు ఇది నిజమైన ఘటనేమో అనుకుంటున్నారు. మాకూ ఇలాంటి నిధి దొరికితే బాగుండు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది కేవలం జనాల్ని పక్కదారి పట్టించే వీడియో మాత్రమే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..