- Telugu News Photo Gallery Drinks for Summer: Take these Drinks in Summer which are Home Remedies To Treat Heat Stroke
డీహైడ్రేషన్, ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం
ఏప్రిల్ లోనే ఎండలు మండిస్తున్నాయి. రోజు రోజుకీ ఎండ వేడి, వడగాల్పులు పెరిగిపోతున్నాయి. దీంతో అత్యవసర పని ఉంటే తప్ప బయటకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇంట్లో ఫ్యాన్స్ కింద కూర్చున్నా చెమటలు పట్టేస్తున్నాయి. అయినప్పటికీ రోజు చేయాల్సిన పనుల నుంచి మాత్రం తప్పించుకోలేరు. దీంతో తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులే హీట్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది.
Updated on: Apr 18, 2024 | 9:07 PM

ఎండ వేడికి తల నొప్పి, పెరిగిన హృదయ స్పందన రేటు, చర్మం ఎర్రబడటం, తల తిరగడం, వికారం, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శారీరక అలసట, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే హీట్ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.

శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ లేదా హీట్ స్ట్రోక్‌తో బాధపడవచ్చు. డీహైడ్రేషన్ వల్ల అనేక శారీరక ఇబ్బందులు పడవచ్చు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? వంటింటి నివారణలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమనం కోసం ఉల్లిపాయ రసం ఉపయోగించండి. మూత్ర విసర్జన అనంతరం ఉల్లిపాయ రసం తీసుకుని చెవులు, ఛాతీపై రుద్దండి. ఇలా చేయడం వలన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంతేకాదు పచ్చి ఉల్లిపాయలను కూడా తినవచ్చు.

చింతపండు నీరుని తయారు చేసుకుని తినాలి. చింతపండులో విటమిన్లు, మినరల్స్ , ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. చింతపండు నీరు అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వేసవిలో కడుపు సమస్యలను కూడా దూరం చేస్తుంది.

ఎండ వేడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పచ్చి మామిడి షర్బత్ లేదా ఆమ్ పన్నా షర్బత్ ను తీసుకోండి. వేడి వాతావరణంలో రోజుకు మూడు సార్లు ఈ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి శారీరక హాని ఉండదు. పచ్చి మామిడి, జీలకర్ర, సోపు, బీట్‌రూట్ వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు తక్షణ శక్తిని అందిస్తాయి.

రోడ్డుపైకి వెళ్లిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తే కొబ్బరి నీరుని తాగాలి. కొబ్బరి నీరు శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి పుల్లటి పెరుగుతో చేసిన షరబత్ ను లేదా లస్సీని తీసుకోవాలి. ఇవి చెమట ద్వారా శరీరం కోల్పోయే ఖనిజాలను పొందుతారు. అంతేకాదు ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి.





























