Kalki vs Devara: కల్కి, దేవర పంపిణీ హక్కులు.. అస్సలు తగ్గని నిర్మాతలు..

సినిమా ఎలా ఉంది అని అనడానికి ఇంతకు ముందు టాక్‌ ఎలా ఉంది? జనాలేమంటున్నారు? అనే మాట నడిచేది... ఇప్పుడు పరిస్థితి మారింది? ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంత చేసింది? బాక్సాఫీస్‌ ఏమంటోంది? అనేదే లెక్క... ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో సినిమా సక్సెస్‌ని డిసైడ్‌ చేసేది ఎప్పుడూ లెక్కలే అన్నది ట్రేడ్‌ పండిట్స్ చెప్పే విషయం... ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన కల్కి, దేవర చిత్రాల లెక్కలెలా ఉన్నాయి చూసేద్దాం రండి...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Apr 18, 2024 | 4:35 PM

సినిమా ఇండస్ట్రీకి అత్యద్భుతంగా కలిసొచ్చిన మే9న ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడీని రిలీజ్‌ చేయాలన్నది మేకర్స్ ముందు నుంచీ అనుకున్న మాట. అయితే ఇప్పుడు ఆ డేట్‌ మీద మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. 

1 / 5
రిలీజ్‌ డేట్‌ విషయం ఎలా ఉన్నప్పటికీ, సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ నెంబర్స్ మాత్రం రెబల్‌ ఫ్యాన్స్ లో హుషారు నింపేస్తున్నాయి. డార్లింగ్‌ ప్రభాస్‌ కల్కికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ లెక్కలు చెబుతున్నారు ట్రేడ్‌ పండిట్స్.

2 / 5
ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఒకట్రెండు ఏరియాల బిజినెస్‌ క్లోజ్‌ అయిందని, డిస్ట్రిబ్యూటర్లు గట్టి ఫిగరే కోట్‌ చేశారన్నది టాక్‌. ప్రభాస్‌ గత సినిమాలతో పోలిస్తే కల్కి మీద భారీ హోప్స్ ఉన్నాయి. రీసెంట్‌ సలార్‌ సక్సెస్‌ కూడా ఈ బిజినెస్‌కి ప్లస్‌ అయింది.

3 / 5
ప్రభాస్‌కి సలార్‌ ప్లస్‌ అయితే, ఎన్టీఆర్‌కి ట్రిపుల్‌ ఆర్‌ ఇచ్చిన హై మామూలుది కాదు. అందుకే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర ప్రీ రిలీజ్‌ లెక్కలు కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దేవర పార్ట్ ఒన్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 140 కోట్ల దాకా ఉందన్నది న్యూస్‌.

4 / 5
కొరటాల శివ మేకింగ్‌ చూసి కాన్ఫిడెంట్‌గా నార్త్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ గా రంగంలోకి దిగారు కరణ్‌ జోహార్‌ అండ్‌ అనిల్‌ తడానీ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ప్రముఖుల మధ్య ఈ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడిందన్నది వైరల్‌ న్యూస్‌. ఇంతకీ కల్కి, దేవర పంపిణీ హక్కులను దక్కించుకునేదెవ్వరు? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ.

5 / 5
Follow us