AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foamy Urine Side Effects: మూత్రం నుంచి నురగ వస్తుందా.. అయితే చాలా డేంజర్!

ప్రస్తుతం అన్నీ విచిత్రకరమైన రోగాలు అన్నీ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోక పోవడం. అదే విధంగా జీవన విధానంలో మార్పులు రావడం వల్ల కూడా వివిధ రకాల రోగాలు ఎటాక్ చేస్తున్నాయి. మనం ఏది తింటామో.. మన శరీరం కూడా అదే చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది యూరిన్ కి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. యూరిన్ ఇన్ ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూత్రం రంగు, వాసనల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పాటు కొందరిలో..

Foamy Urine Side Effects: మూత్రం నుంచి నురగ వస్తుందా.. అయితే చాలా డేంజర్!
Foamy Urin Side Effects
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 07, 2023 | 10:10 PM

Share

ప్రస్తుతం అన్నీ విచిత్రకరమైన రోగాలు అన్నీ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోక పోవడం. అదే విధంగా జీవన విధానంలో మార్పులు రావడం వల్ల కూడా వివిధ రకాల రోగాలు ఎటాక్ చేస్తున్నాయి. మనం ఏది తింటామో.. మన శరీరం కూడా అదే చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది యూరిన్ కి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. యూరిన్ ఇన్ ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూత్రం రంగు, వాసనల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పాటు కొందరిలో అయితే మూత్రంలో నురగ కూడా వస్తుంది. ఇలా మూత్రంలో నురగ రావడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. మరి ఇలా నురగ రావడం వల్ల ఏవైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. ఇది రాడానికి కారణాలు కూడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్రంలో నురగ రావడానికి కారణాలు:

మూత్రంలో నురగ రావడానికి ప్రధాన కారణం.. ఒత్తిడి అని చెబుతున్నారు నిపుణులు. ఇలా మూత్రంలో నురగ వచ్చే వాళ్లు.. ఎక్కువగా టెన్షన్ పడొద్దని అంటున్నారు. ఇంకా మూత్రంలో నురగ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నీటిని తక్కువగా తీసుకోవడం:

చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. దాహం వేస్తే తప్ప నీటిని తాగరు. ఇలా శరీరంలో నీటి కొరత తక్కువగా ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటిని తక్కువగా తీసుకునే వారికి.. మూత్రం పసుపు రంగులో వస్తుంది. ఆ తర్వాత నురగ వస్తుంది. అంతే కాకుండా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్ మూత్రంలో కరిగి నురగ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి

కిడ్నీల సమస్య:

కొంత మందిలో మూత్ర పిండల సమస్య కారణంగా కూడా మూత్రంలో నురగ వచ్చే ఛాన్సులు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్న వారికి కిడ్నీలో రాళ్ల సమస్య కూడా పెరుగుతుంది.

అమిలోయిడోసిస్:

అమిలోయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి. దీని వల్ల కూడా మూత్రంలో నురగ వస్తుందని నిపుణులు అంటున్నారు. కొంత మందిలో దీని కారణంగా మూత్ర పిండాల సమస్యలు కూడా వస్తాయట.

డయాబెటీస్:

డయాబెటీస్ కారణంగా కూడా మూత్రంలో మార్పులు వస్తాయి. ఈ క్రమంలో మధు మేహంతో బాధ పడేవారికి పదే పదే మూత్రం ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా మూత్రంలో నురగ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మూత్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. లేదంటే ఇవి పలు రకాల ఇన్ ఫెక్షన్ లకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..