AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి మంచిదని డైట్ సోడా ఎక్కువగా తాగుతున్నారా..? షాకింగ్ విషయాలు మీకోసం..!

బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా డైట్ సోడా వైపు మొగ్గు చూపుతుంటారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ నిజానికి దీన్ని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి అనేక రకాల దుష్పరిణామాలు కలగవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. డైట్ సోడా వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మంచిదని డైట్ సోడా ఎక్కువగా తాగుతున్నారా..? షాకింగ్ విషయాలు మీకోసం..!
Is Diet Soda Really Healthy
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 8:18 PM

Share

డైట్ సోడా మగవారికంటే మహిళల ఆరోగ్యాన్ని ఎక్కువగా దెబ్బతీస్తుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్, స్ట్రోక్ అసోసియేషన్ చేసిన అధ్యయనంలో దీన్ని రెగ్యులర్‌ గా తాగే మహిళలకు అధిక బరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

డైట్ డ్రింక్స్ లో ఉండే అస్పార్టేట్, సుక్రలోజ్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు ఆహారం జీర్ణమయ్యే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. దీర్ఘకాలంగా వీటిని తీసుకుంటూ ఉంటే మానసిక ఆహార నియంత్రణ దెబ్బతినవచ్చు, బరువు పెరగడం మొదలవుతుంది.

డైట్ సోడాల్లో ఉన్న ఫాస్ఫరిక్ యాసిడ్ లాంటి రసాయనాలు ఎముకల బలాన్ని తగ్గించే ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇది ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న వారికి ఎముకలు గుల్లబారడానికి (ఆస్టియోపొరోసిస్) దారితీస్తుంది.

డైట్ సోడా వంటి ఆమ్లత ఎక్కువగా ఉండే డ్రింక్స్ తరచూ తాగడం వల్ల పళ్లపై ఉండే ఎనామెల్ పోతుంది. దీని వల్ల పళ్లలో నొప్పి, పళ్ల రంగు మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

రోజుకు నాలుగు గ్లాసులు లేదా అంతకన్నా ఎక్కువ డైట్ సోడా తాగే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువగా ఉందని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఒక నివేదికలో పేర్కొంది. మానసిక స్థిరత్వానికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు.

కొంతమందికి డైట్ సోడా తాగిన తర్వాత కడుపులో గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి అసౌకర్యాలు కలగవచ్చు. ఇది వారిలో జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

అస్పార్టేట్ వంటి తీపి పదార్థాలపై కొంతమంది సున్నితత్వం కలిగిన వ్యక్తులకు డైట్ సోడా తాగిన వెంటనే తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. ఇది వ్యక్తులను బట్టి మారవచ్చు.

చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంది అనే నమ్మకంతో తరచూ డైట్ సోడాను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యపరమైన ముప్పులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇది జీర్ణ వ్యవస్థ నుంచి మొదలుకొని మానసిక స్థితి, ఎముకల ఆరోగ్యం వరకు ప్రభావం చూపుతుంది. అందుకే తక్కువ కేలరీల కోసం మంచి ప్రత్యామ్నాయంగా నిమ్మ నీరు, కొబ్బరి నీరు వంటి సహజ డ్రింక్స్ లను ఎంచుకోవడం ఉత్తమం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)