AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamun fruit Benefits: నేరేడు పండ్లు అంటే మీకు ఇష్టం ఉండదా..? ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

నేరేడు.. సీజనల్ ఫ్రూట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనే ఇవి విరివిగా దొరుకుతాయి. ఇవి తీపిగా ఉండవు కనుక....

Jamun fruit Benefits: నేరేడు పండ్లు అంటే మీకు ఇష్టం ఉండదా..? ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Jamun Fruit
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 05, 2021 | 1:57 PM

Share

నేరేడు.. సీజనల్ ఫ్రూట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనే ఇవి విరివిగా దొరుకుతాయి. ఇవి తీపిగా ఉండవు కనుక.. అందరూ ఇష్టంగా తినరు. అయితే మేము చెప్పే విషయాలు చదివితే మీరు నేరేడును మీరు అస్సలు మిస్ అవ్వరు. నేరేడులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవరసమైన విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది. ఇక ఇనుము అయితే పుష్కలంగా లభిస్తుంది. ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. తరచూ దప్పిక వేయడం, యూరిన్‌కి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఫుడ్ బాగా డైజిస్ట్ అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఇక మధుమేహం ఉన్నవారికి అయితే నేరేడు పండు చేసే మేలు అంతా, ఇంతా కాదు. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. ఈ ఫ్రూట్ మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. నేరేడు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.అధిక రక్తపోటుకు గురికాకుండా కాపాడుతుంది.

బ్యూటీ విషయంలో కూడా నేరేడు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.  దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా కనిపించవు.

(Noteఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ సమాచారం అందించాం. ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ వివరాల కోసమైనా మీకు తెలిసిన నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది)

Also Read:కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఆ చేప నోట్లో మనిషి ‘పళ్ళు’..అమెరికాలోని జాలరికి లభించిన అరుదైన మత్స్యం

తూర్పుగోదావరి జిల్లాలో వింత.. కోడిపెట్టే కాదు కోడిపుంజు కూడా గుడ్డు పెడుతుంది..