Throat Infection: గొంతునొప్పి, వాపుతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి..!
Throat Infection: కొన్నిసార్లు వాతావరణంలో మార్పులు కారణంగా అకస్మాత్తుగా గొంతులో ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. అలాగే ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగడం, వర్షంలో

Throat Infection: కొన్నిసార్లు వాతావరణంలో మార్పులు కారణంగా అకస్మాత్తుగా గొంతులో ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. అలాగే ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగడం, వర్షంలో ఐస్‌క్రీం తినడం వల్ల గొంతులో వాపు, మంట వస్తుంది. జలుబు, దగ్గు గొంతును ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గొంతులో అలెర్జీలు సంభవిస్తాయి. దీని కారణంగా తినడం, తాగడంలో సమస్య ఉంటుంది. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మందులను తీసుకోకుండా ఎల్లప్పుడూ కొన్ని హోం రెమిడిస్‌ని పాటించండి. ఇవి మీకు గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి.
1.ఉప్పు నీటితో పుక్కిలించండి: గొంతు నొప్పి, వాపు తగ్గించడానికి మీరు ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఇది గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే పుక్కిలించడానికి నీరు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. మీ గొంతు కొంచెం నొప్పిగా ఉంటే పుక్కిలించే బదులు గోరువెచ్చని నీరు తాగండి.
2. గోరువెచ్చని నీటితో వాపు తొలగిపోతుంది: గొంతులో వాపు ఉంటే మీరు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. చల్లటి నీటితో ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. మీకు కావాలంటే నీటిలో కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇది వాపుని తగ్గిస్తుంది.
3. మీరు తేనె నుంచి ఉపశమనం పొందుతారు: మీకు గొంతు నొప్పి లేదా ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ ఉంటే మీరు తేనెను తీసుకోవాలి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగించే యాంటీబయాటిక్ గుణాలు తేనెలో పుష్కలంగా ఉంటాయి. గొంతు నొప్పి, వాపులలో కూడా తేనె ఉపశమనాన్ని కలిగిస్తుంది.
4. పసుపు పాలు తాగండి: మీకు గొంతు నొప్పి ఉంటే రాత్రి పసుపు పాలు తాగాలి. పసుపులో యాంటీబయాటిక్, యాంటిసెప్టిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి వాపు, నొప్పిని తగ్గిస్తాయి. పసుపు గొంతుకు మేలు చేస్తుంది.
5. అల్లం తినండి: గొంతు నొప్పి, జలుబు, దగ్గు విషయంలో అల్లం ఉపయోగించండి. అల్లంలో శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన జింజెరాల్ ఉంటుంది. గొంతునొప్పి పోవాలంటే అల్లం ముక్కను ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చగా తాగాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి