Laptop Effect: ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకొని పనిచేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Laptop Effect: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీని కారణంగా ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువైంది.

Laptop Effect: ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకొని పనిచేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!
Laptop Effect
Follow us
uppula Raju

|

Updated on: Jun 02, 2022 | 6:30 AM

Laptop Effect: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీని కారణంగా ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువైంది. అయితే ల్యాప్‌టాప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. రోజంతా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి వల్ల చర్మం, అంతర్గత కణజాలం దెబ్బతింటున్నాయి. ల్యాప్‌టాప్‌ ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని పని చేయడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఏర్పడుతాయి. అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్‌కి రేడియేషన్‌కి సంబంధించినది కాబట్టి ల్యాప్‌టాప్ కంటే వైఫైకి కనెక్ట్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. ల్యాప్‌టాప్‌ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.

పురుషులలో వంధ్యత్వం

ల్యాప్‌టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం శరీరం లోపల ఉంటుంది. పురుషులలో పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్‌టాప్‌లు వాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడుతాయి.

ఇవి కూడా చదవండి

వైఫై ద్వారా రేడియేషన్

ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

కండరాల నొప్పులు

ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్‌పై పెట్టుకొని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్‌టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్
ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వేదిస్తుందా? బీ కేర్ ఫుల్..
ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వేదిస్తుందా? బీ కేర్ ఫుల్..