Health Tips: డైటింగ్ అంటూ ఒకపూటే తింటున్నారా..? అయితే డేంజర్‌లో ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి
Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే.. బరువు తగ్గడానికి డైట్‌ని అనుసరిస్తుంటారు. ఇది మంచిదే అయినప్పటికీ.. కొంతమంది డైటింగ్..

Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే.. బరువు తగ్గడానికి డైట్‌ని అనుసరిస్తుంటారు. ఇది మంచిదే అయినప్పటికీ.. కొంతమంది డైటింగ్ సమయంలో రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇలా చాలారోజులు చేయడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. పగటిపూట ఎక్కువ ఆహారం తీసుకున్న తర్వాత, సాయంత్రం ఖచ్చితంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఒకేసారి ఆహారం తీసుకుంటే, అది శరీరంలో అవసరమైన పోషకాల లోపానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి తగినంత ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రాష్ డైట్ శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ సేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒక్క పూట తినడం వల్ల కలిగే నష్టాలు..
అలసట, నీరసం: మీరు రోజుకు ఒకసారి ఎక్కువ ఆహారం తింటే అది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కానీ ఇది బలహీనత, అలసటకు దారితీస్తుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.




జీర్ణవ్యవస్థపై ప్రభావం: తక్కువ తినడం జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా శరీరానికి సరైన పోషకాహారం లభించదు. దీని కారణంగా ప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో, పోషకాలను గ్రహించడంలో సమస్యలను ఎదుర్కొంటాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది.
మలబద్ధకం సమస్య: చాలా సార్లు తక్కువ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. ఆహారంలో తగినంత ఫైబర్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇదేకాకుండా జీర్ణవ్యవస్థ ప్రక్రియ కూడా మందగిస్తుంది.
డిప్రెషన్: మీరు అవసరం కంటే తక్కువ తినడం ద్వారా కూడా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. మీరు రోజులో చాలా తక్కువ కేలరీలు తీసుకుంటే ఆందోళన లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
బలహీనమైన రోగనిరోధక శక్తి: చాలా సార్లు తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషకాల కొరత ఏర్పడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీకు ఇన్ఫెక్షన్, జలుబు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




