Health Tips: పురుషులకి ముఖ్య గమనిక.. 40 ఏళ్ల తర్వాత గుండె ఫిట్‌గా ఉండాలంటే ఈ డైట్‌ పాటించాల్సిందే..!

Health Tips: నలభై ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. శరీరం క్షీణించడం ప్రారంభించడం మొదలవుతుంది. అందుకే ఈ వయసులో కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

Health Tips: పురుషులకి ముఖ్య గమనిక.. 40 ఏళ్ల తర్వాత గుండె ఫిట్‌గా ఉండాలంటే ఈ డైట్‌ పాటించాల్సిందే..!
After Age Of 40
Follow us
uppula Raju

|

Updated on: Jun 02, 2022 | 6:02 AM

Health Tips: నలభై ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. శరీరం క్షీణించడం ప్రారంభించడం మొదలవుతుంది. అందుకే ఈ వయసులో కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేయాలి. మహిళల్లో మాదిరి 40 ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కానీ చాలా మంది వీటిని విస్మరిస్తారు. అధిక బీపీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నలభై సంవత్సరాల వయస్సులో ఎలాంటి డైట్‌ పాటించాలో తెలుసుకుందాం.

1. పాల ఉత్పత్తులను తగ్గించండి

ఎవ్వరైనా ప్రతిరోజు ఉదయం టిఫిన్‌ చేస్తారు. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే నలభై సంవత్సరాలు దాటిన వారు పాల ఉత్పత్తుల మొత్తాన్ని తగ్గించడం మంచిది. ఎందుకంటే ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

2. భోజనంలో పండ్లు, కూరగాయలను చేర్చండి

పండ్లు, కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వ్యాధితో పోరాడడంలో సహాయపడే పోషకాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. కాబట్టి 40 ఏళ్ల తర్వాత పురుషులు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనంలో పండ్లు, కూరగాయలని చేర్చుకోవాలి.

3. గింజలు, మొలకలు ఎక్కువగా తినాలి

స్నాక్స్‌లో గింజలు, మొలకలు ఎక్కువగా తీసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత పురుషులు పకోడి, బజ్జీలు లాంటి ఆయిల్‌ ఫుడ్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ఊబకాయం, అసిడిటీ ఏర్పడుతుంది. అందువల్ల స్నాక్స్‌లో గింజలు, మొలకలను చేర్చితే మంచిది.

4. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తినాలి

మీరు రాత్రి భోజనంలో అధిక ప్రొటీన్లు ఉండే విధంగా చూసుకోవాలి. పప్పులు, పండ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలి. శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్‌ చేయాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి