AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై బీపీ తగ్గాలంటే వెంటనే ఈ ఫుడ్స్ తినడం మానేయండి.. లేకుంటే అంతే సంగతి..!

రక్తపోటు సమస్య ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తోంది. ఆహారపు అలవాట్లు, ఒత్తిడిగల జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల హై బీపీ సమస్య వస్తోంది. అయితే కొన్ని ఆహారాలు ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. అలాంటి పదార్థాల నుంచి దూరంగా ఉండటం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. హై బీపీ ఉన్నవారు తప్పకుండా నివారించాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

హై బీపీ తగ్గాలంటే వెంటనే ఈ ఫుడ్స్ తినడం మానేయండి.. లేకుంటే అంతే సంగతి..!
High Blood Pressure
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 7:21 PM

Share

ఆహారంలో సోడియం పరిమాణం పెరిగితే.. శరీరంలోని ద్రవం స్థాయి పెరిగి బీపీ పెరుగుతుంది. కాబట్టి ఉప్పు మితంగా తీసుకోవడం ఎంతో అవసరం. కాచిన ఉప్పు లేదా రిఫైన్డ్ ఉప్పుకు బదులుగా కొంతవరకు మరిగించిన ఉప్పు లేదా రాక్ సాల్ట్ వాడటం మంచిది. పిజ్జా వంటి రెడీమేడ్ ఆహారాల్లో సోడియం, ఫ్యాట్, ప్రిజర్వేటివ్‌ లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉన్న ఉప్పు శరీరంలోని రక్తపోటును వేగంగా పెంచుతుంది. కాబట్టి వీటిని తగ్గించడమే ఉత్తమం.

చిప్స్ వంటి పదార్థాలలో వేయించిన నూనె, ఉప్పు అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరగడం ఖాయం. ఇవి అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలకు దారి తీస్తాయి.

తయారు చేసి నిల్వ చేసిన మాంసాన్ని తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఈ మాంసంలోని ప్రిజర్వేటివ్‌ లు, ఉప్పు, ఇతర రసాయనాలు రక్తపోటు నియంత్రణకు అడ్డు పడతాయి.

బీపీ ఉన్నవారు చక్కెరను కూడా నియంత్రించాలి. మధుమేహం లేకపోయినా.. చక్కెరను నియంత్రిత మోతాదులో తీసుకోవాలి. ప్యాక్ చేసిన డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కన్నా తాజా పండ్ల రసం ఉత్తమం.

ఊరగాయల తయారీలో అధిక ఉప్పును ఉపయోగిస్తారు. ఇది బీపీ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి వీటిని తగ్గించాలి.

బయట దొరికే కూల్ డ్రింక్స్, సోడాల్లో చక్కెరతో పాటు కృత్రిమ రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తపోటు పెరగడమే కాదు గుండెకు సంబంధించిన సమస్యలకూ దారి తీస్తాయి.

చీజ్‌ లో ఎక్కువ సోడియం ఉంటుంది. రెగ్యులర్‌ గా చీజ్ తీసుకునే వారి బీపీ స్థాయిలు వేగంగా పెరగవచ్చు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన చీజ్‌ లను పూర్తిగా నివారించాలి.

కాఫీ, టీ వంటి డ్రింక్ లలో కెఫిన్ ఉంటుంది. ఇది తాత్కాలికంగా రక్తపోటు పెంచే ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇవి రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే పరిమితంగా తీసుకోవాలి.

టొమాటో సాస్, కెచప్‌ లలో ఎక్కువ ఉప్పు చక్కెర కలిగి ఉంటుంది. ఇవి రోజువారీగా తీసుకుంటే బీపీ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

ఈ రకాల ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా బీపీని సహజంగా నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచవచ్చు.