Silent Heart Attack: గుండెకే తెలియకుండా గుండెకు కోత.. అశ్రద్ధ చేస్తే కావొచ్చే ప్రాణాంతకం.. బీ అలర్ట్!
మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సైలెంట్ హార్ట్ అటాక్ లతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ సమస్య, ఛాతీ లేదా పైభాగంలో కండరాలు ఒత్తిడికి గురికావడం, అధిక అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మనకు వచ్చే వ్యాధికి ముందస్తు హెచ్చరికలు, కొన్ని లక్షణాలు ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు, నొప్పులు, వికారం వంటి లక్షణాలు సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తున్నప్పుడు కనిపిస్తాయి. వాటి ద్వారా మనం మనకు వచ్చిన వ్యాధిపై అంచనాకు రావొచ్చు. అయితే కొన్ని వ్యాధులు ఏమాత్రం లక్షణాలను చూపకుండా, కనీసం ముందస్తు హెచ్చరికలు రాకుండా మనిషిని కబళిస్తాయి. ఏకంగా ప్రాణాలనే కబళిస్తాయి. అటువంటి వ్యాధుల్లో గుండె సంబంధిత వ్యాధులు ప్రథమ స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా సైలెంట్ హార్ట్ అటాక్. ఇది ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండా ప్రాణాలను హరిస్తుంది. దీనినే సైలెంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్ క్షన్ (ఎస్ఎంఐ) అని కూడా అంటారు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్‌లను గుర్తించడం చాలా కష్టం. హార్వర్డ్ యూనివర్సిటీ డేటా ప్రకారం, దాదాపు 45% గుండెపోటులు ఈ సైలెంట్ హార్ట్ అటాక్ లేనని చెబుతున్నారు.
లక్షణాలను గుర్తించలేరు.. ఇది సంభవించినప్పుడు అలసట , గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ ఇన్‌ఫ్లక్స్, అజీర్ణం వంటి అస్పష్టమైన లక్షణాలను చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఇవి గుండెకు సంబంధించినది కాకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట వంటి దీర్ఘకాలిక లక్షణాలు వచ్చే సమయానికి ప్రజలు ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఎవరికి వస్తుందంటే.. మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సైలెంట్ హార్ట్ అటాక్ లతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది జీర్ణక్రియ సమస్య, ఛాతీ లేదా పైభాగంలో కండరాలు ఒత్తిడికి గురికావడం, అధిక అలసట వంటివి కనిపిస్తాయి. సాధారణంగా 45 ఏళ్లు పైబడిన పురుషులు,55 ఏళ్లు పైబడిన మహిళలు దీని బారిన పడే అవకాశం ఉంది.
ఎలా గుర్తించాలి.. పైన చెప్పినట్లుగా సైలెంట్ హార్ట్ ఎటాక్‌లు తరచుగా సాధారణ గుండెపోటులా అనిపించవు. అయితే చేయి, మెడ లేదా దవడలో కత్తిపోటు నొప్పి, ఊపిరి ఆడకపోవడం, చెమటలు పట్టడం లేదా కళ్లు తిరగడం వంటివి నిసైలెంట్ హార్ట్ ఎటాక్ ను సూచిస్తాయి. ఈ లక్షణాలు చాలా తేలికపాటి లేదా అస్పష్టంగా ఉంటాయి. అందుకే ప్రజలు వాటిని ఇతర ఆరోగ్య సమస్యలే అనుకొని గందరగోళానికి గురవుతారు. స్వీయ-చికిత్సను చేసేసుకుంటారు. అక్కడే అసలు సమస్య వస్తుంది.
ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది.. ఎవరైనా చాలా శారీరకంగా లేదా మానసికంగా ఒత్తిడితో కూడిన పనిని చేసినప్పుడు కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌లు సంభవించవచ్చు. అకస్మాత్తుగా శారీరకంగా చురుకుగా మారడం లేదా చలిలో ఎక్కువ శారీరక శ్రమ చేయడం కూడా ప్రమాద కారకాలు కావచ్చు.
గుర్తించలేరా.. ఎవరికైనా సైలెంట్ హార్ట్ వచ్చినా వారికి తెలిసే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆ వ్యక్తి అది గుండె పోటను గుర్తించలేడు. కాబట్టి వైద్య సహాయం తీసుకోకపోవచ్చు. అయితే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) లేదా ఇమేజింగ్ స్కాన్‌ల వంటి వైద్య పరీక్షలు చేసినప్పుడు యాధృచ్చికంగా దీనిని గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
ఎలాంటి లక్షణాలుంటాయి..
- మీకు ఫ్లూ ఉన్నట్లు అనిపించవచ్చు
- మీ ఛాతీ లేదా పైభాగంలో కండరాలు నొప్పిగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు
- దవడ నొప్పి మరొక సూచిక
- చేతులు లేదా పైభాగంలో నొప్పి
- అలసట
- అజీర్ణం
ప్రాణాంతకమా.. సైలెంట్ హార్ట్ ఎటాక్ లు తీవ్రమైనవి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. సకాలంలో రోగనిర్ధారణ, చికిత్స జరగక పోవడం వల్ల గుండె కండరాలకు నష్టం పెరుగుతుంది. ఇది సమస్యలకు దారితీస్తుంది. భవిష్యత్తులో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో సైలెంట్ హార్ట్ అటాక్ లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నివారణ ఇలా.. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా మీరు సైలెంట్ హార్ట్ అటాక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం, సాధారణ శారీరక శ్రమ చేయాలి. ధూమపానం మానేయాలి. మీరు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే, మితంగా తీసుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే.. రెగ్యులర్ చెక్-అప్‌లు, స్క్రీనింగ్‌లు కూడా ప్రమాదాన్ని తగ్గించగలవు.
చికిత్స ఏమిటి.. యాంజియోగ్రఫీ ఫలితాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. బ్లాక్‌లు క్లిష్టమైనవి. ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్నట్లయితే, యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ అవసరం కావచ్చు. ఇతర ప్రాంతాలలో వైద్య నిర్వహణ మరియు ఈఈసీపీ చికిత్స మాత్రమే ప్రయోజనకరంగా ఉండవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..