Health Tips: మీ కాళ్లలో తరచుగా నొప్పి వస్తుందా? అయితే, ఈ సమస్య ఉందేమో చెక్ చేసుకోండి..
హైకొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. దీనిని పసిగట్టకపోతే.. ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. సకాలంలో గుర్తించి, తగు చర్యలు తీసుకోకపోతే

హైకొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. దీనిని పసిగట్టకపోతే.. ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. సకాలంలో గుర్తించి, తగు చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే.. హైకొలెస్ట్రాల్ మొదట్లోనే గుర్తించడం కష్టం. ఆరోగ్యం క్షీణించిన తరువాతే దీనిని గుర్తించడానికి వీలుంటుంది. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే.. అది ధమనులలో పేరుకుపోతుంది. ఫలితంగా రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే, కొలెస్ట్రాల్ పెరిగింది అనడానికి శరీరంలో కనిపించే మొదటి సంకేతం.. కాళ్లలో కనిపిస్తుంది. దీనిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD) అని పిలుస్తారు.
కాళ్ల నొప్పులు అధిక కొలెస్ట్రాల్‌కు సూచన..
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి మొదటి లక్షణం కాళ్ళ నొప్పులు లేదా తిమ్మిరి వస్తుంది. ఇవి అసంకల్పిత కండరాల సంకోచం లేదా మూర్ఛ కదలికల ఫలితంగా సంభవిస్తాయి. ఇది కండరాలు బిగుసుకున్నట్లు అనిపిస్తుంది. చాలా అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది. అయితే, ఈ సమస్య వివిధ కారణాల వల్ల కూడా ఎదురవ్వొచ్చు. అలాకాకుండా కాలి నొప్పి తరచుగా వస్తే.. అది PADకి సంబంధించినది అయి ఉంటుంది. ఇది రోజులు గడుస్తున్నా కొద్ది ఎక్కువ అవుతుంటుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. మళ్లీ పనులు చేస్తున్నప్పుడు ఇబ్బంది ఎదురవుతుతుంది. కండరాలపై ఎక్కువ భారం పడటం, డీహైడ్రేషన్, కండరాల ఒత్తిడి, వ్యాయామం మొదలైన వాటి వల్ల కూడా సంభవిస్తుంది.
PAD ఇతర లక్షణాలు..
1. కాళ్ల నొప్పులు, తిమ్మిరి రావడం.




2. విశ్రాంతి తీసుకున్నప్పుడు పాదాలు, కాలి వేళ్లలో మంటగా ఉండటం, లేదా నొప్పి రావడం.
3. పాదాలపై చర్మం చల్లబడుతుంది.
4. చర్మం రంగు మారడం.
5. తరచుగా అంటు వ్యాధుల బారిన పడటం.
6. కాలి, పాదాల వద్ద అయ్యే గాయాలు త్వరగా నయం కాకపోవడం.
అధిక కొలెస్ట్రాల్ ఉన్న సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మీరు తినే ఆహారంలో సంతృప్త కొవ్వులను తగ్గించాలి. ఆకు కూరగాయలు, సీజనల్ పండ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న చేపలు తినాలి. ఉప్పు, ఆల్కాహాల్ వినియోగాన్ని పరిమితం చేయాలి. కనీసం వారానికి 5 రోజులు వ్యాయామం చేయాలి. జీవనశైలిలో ఈ మార్పులు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా మారుస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




