Overexercising: ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా..? అయితే మీరు ఈ సమస్యలను కోరి తెచ్చుకుంటున్నట్టే
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, ప్రజలు స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్ అలాగే డ్యాన్స్ వంటివి చేస్తుంటారు. ఫిట్‌నెస్ క్రేజ్ జనలపై చాలా ఎక్కువగా ఉంటుంది.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యానికి కూడా వ్యాయామం అవసరం. వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది, అలాగే అనేక వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, ప్రజలు స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్ అలాగే డ్యాన్స్ వంటివి చేస్తుంటారు. ఫిట్‌నెస్ క్రేజ్ జనలపై చాలా ఎక్కువగా ఉంటుంది. జిమ్ చాలా మంది గంటల తరబడి చెమటలుచిందిస్తూ ఉంటారు. వ్యాయామం ఆరోగ్యానికి చాలా అవసరం, కానీ అధిక వ్యాయామం మిమ్మల్ని అనేక వ్యాధులకు గురి చేస్తుంది. అధిక వ్యాయామం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే ఎముకలను దెబ్బతీస్తుంది. ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల మీరు వేగంగా ఫిట్ అవుతారని అనుకుంటారు.. కానీ అధిక వ్యాయామం మీ రక్తపోటును పెంచుతుంది, ఇది మీ గుండెను ప్రమాదంలో పడేస్తుంది. అధిక వ్యాయామం కారణంగా, శరీరం విశ్రాంతి తీసుకోలేకపోతుంది. అలాగే గుండె సాధారణ రేటు కంటే వేగంగా కొట్టుకుంటుంది.
అధిక వ్యాయామం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది, ఇది మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలసిపోయేలా చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత మిమ్మల్ని మానసిక అనారోగ్యానికి గురి చేస్తుంది. నిత్యం అలసిపోయి ఎంత నిద్రపోయినా.. ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో అలసట త్వరగా వస్తుంది. అలాగే దీనివల్ల తలనొప్పి, తల తిరగడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాల వ్యాయామం మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
అధిక వ్యాయామం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు, శరీరం నుండి అడ్రినలిన్ హార్మోన్ విడుదల అవుతుంది, ఇది నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించారు. అలాగే హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్, గాయకుడు కెకె గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు హిందీ టీవీ నటుడు సిద్ధాంత్ సూర్యవంశీ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలి చనిపోయాడు.