Health Tips: మష్రూమ్స్ తో కలిగే లాభాలు తెలిస్తే.. మీరు తినకుండా ఉండలేరు..
మన ఆరోగ్యవంతంగా ఉండేందుకు సరైన డైట్ తీసుకోవాలనుకుంటుంటాం. కాని ఎలాంటి డైట్ పాటించాలో తెలియక ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. మనం తీసుకునే డైట్ తో కొన్ని సార్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Health Tips: మన ఆరోగ్యవంతంగా ఉండేందుకు సరైన డైట్ తీసుకోవాలనుకుంటుంటాం. కాని ఎలాంటి డైట్ పాటించాలో తెలియక ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. మనం తీసుకునే డైట్ తో కొన్ని సార్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరికొన్ని సందర్భాల్లో మనం తీసుకునే డైట్ మన ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారం ఎలాంటిదో ముందే చూసుకోవాలంటారు డైటీషియన్స్. మనం తీసుకునే ఆహారంలో మష్రూమ్ ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు డైటీషియన్స్. చాలా మందికి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇది వెజిటేరియన్ నా.. నాన్ వెజిటేరియనా అనే సందేహం ఇంకా చాలా మందిలో ఉంటూనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికి మష్రూమ్స్ కనిపిస్తే ఎలాగైనా లాంగించేస్తాం. మరి ఎన్నో రకాలుగా వరల్డ్ వైడ్ మష్రూమ్స్ అందుబాటులో ఉంది. మష్రూమ్ లో ఎన్నో పోషక పదార్థాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే పోషక పదార్థాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తుంది. అవెంటో తెలుసుకుందాం..
రక్తపోటును తగ్గిస్తుంది: మష్రూమ్స్ లో పొటాషియం ఎక్కువుగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో అదనపు సోడియం ప్రభావాలను తగ్గించేలా చేస్తుంది. అదనంగా పొటాషియం రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో మెరుగైన రక్త ప్రహహాన్ని ప్రోత్సహించేందుకు మష్రూమ్ ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో మైక్రోఫేజ్ లను ప్రేరిపిస్తాయి. మన రోజువారీ ఆహారంలో మష్రూమ్స్ ని చేర్చడం ద్వారా అనారోగ్యాలబారిన పడే అవకాశాలు తక్కువుగా ఉంటాయి.
బరువు తగ్గడానికి దోహదం: బరువు తగ్గాలి అనుకునేవారు కచ్చితంగా తమ డైట్ లో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. శారీరక వ్యాయామాలు, లైఫ్ స్టైల్ లో మార్పులతో పాటు సరైన పద్ధతిలో మష్రూమ్స్ తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఇది అనేక శాస్త్రీయ అధ్యయనాల్లోనూ రుజువైంది. పుట్టగొడుగుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు, ఇతర జీవక్రియ సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
క్యాన్సర్ ను నివారణ: పుట్టగొడుగులు అధికంగా ఉండే ఆహారం తీసుకునే వ్యక్తులు రొమ్ము క్యాన్సర్ తో బాధపడే అవకాశం మిగతా వారితో పోలిస్తే 34 % తక్కువుగా ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. యాంటీఆక్సిడెంట్లు ఎర్గోథియోనిన్, గ్లుటాతియోన్ తో నిండి ఉంటాయి. అవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.
మనం తినే ఆహారంలో తగిన మోతాదులో పుట్టగొడుగులను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే డైటీషియన్స్ కూడా మనం రోజూ తీసుకునే ఆహారంలోమష్రూమ్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..