Hair Care: జామ ఆకులతో ఇలా చేశారంటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది!

ప్రస్తుతం ఎవర్ని కదిపినా జుట్టు రాలిపోతుందని చెబుతూనే ఉంటున్నారు. జుట్టుకు సరైన విధంగా పోషకాలు అందక హెయిర్ అనేది బలహీన పడుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ జుట్టు రాలి పోతుంది. అదే విధంగా తెల్లగా మారుతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటే.. మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. తల చర్మం లోపల కొల్లాజెన్ దెబ్బ తినడం వల్ల జుట్టు కుదళ్లు బలహీనమవుతున్నాయి. దీంతో జుట్టు రాలి పోతుంది. అయితే జుట్టు సమస్యలను..

Hair Care: జామ ఆకులతో ఇలా చేశారంటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది!
అధిక బరువుతో బాధపడేవారు బరువును నియంత్రించాలనుకుంటే, జామపండ్లను తినొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను బలపరుస్తుంది.
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:35 PM

ప్రస్తుతం ఎవర్ని కదిపినా జుట్టు రాలిపోతుందని చెబుతూనే ఉంటున్నారు. జుట్టుకు సరైన విధంగా పోషకాలు అందక హెయిర్ అనేది బలహీన పడుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ జుట్టు రాలి పోతుంది. అదే విధంగా తెల్లగా మారుతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటే.. మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. తల చర్మం లోపల కొల్లాజెన్ దెబ్బ తినడం వల్ల జుట్టు కుదళ్లు బలహీనమవుతున్నాయి. దీంతో జుట్టు రాలి పోతుంది. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన షాంపూలు, రక రకాల నూనెలు వాడి ఉంటారు. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్సే తప్ప సరైన విధంగా ఫలితాలు ఉండవు. జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి జామ ఆకులు అనేవి బాగా ఉపయోగ పడతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

జామ ఆకుల మాస్క్:

ముందుగా జామ ఆకులను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకులతో పేస్ట్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించండి. ఓ గంట పాటు ఉంచుకుని.. తర్వాత కుంకుడు కాయలతో హెడ్ బాత్ చేసు కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

జామ ఆకుల వాటర్:

కొన్ని జామ ఆకులను తీసుకుని.. వీటిని శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి మరిగించాలి. ఇవి బాగా చల్లారాక.. వడకట్టాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని జుట్టు కుదళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించి.. మర్దనా చేయాలి. ఇలా ఓ గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదళ్లు గట్టి పడి రాలే సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా పొడుగ్గా పెరుగుతుంది. ఏవేవో రసాయనాలు వాడే బదులు.. కేవలం జామ ఆకులు వాడితే సులభంగా ఈ జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.

ఇంకా ఎన్నో బెనిఫిట్స్:

జామ ఆకులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల్లో ఉండే కొల్లా జెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయ పడుతుంది. అలాగే జామ ఆకుల్లో ఉండే లైకోపిన్ అనే రసాయన సమ్మేళనం.. ఎండ నుండి జుట్టును కాపాడడంలో మనకు దోహద పడుతుంది. జామ ఆకులతో కేవలం జుట్టునే కాకుండా.. జలుబు, దగ్గు, నోటి పూత, పండి నొప్పి వంటి సమస్యల నుంచి కూడా బయట పడొచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు