- Telugu News Photo Gallery Drinking these juices can prevent heart attack, check here is details in Telugu
Heart Precautions: ఈ జ్యూస్ లు మీ డైట్ లో చేర్చుకుంటే.. గుండె పోటు రాకుండా ఉంటుంది!
ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో గుండె బలహీనంగా మారుతుంది. దీంతో వయసుతో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ లోనే గుండె పోటుతో మరణిస్తున్నారు. శరీరంలో అన్నింటిలో కంటే గుండె ప్రధానమైనది. గుండె చప్పుడు ఆగిపోతే.. ప్రాణమే పోతుంది. కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ డైట్ లో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్ లు అనేవి మెండుగా..
Updated on: Nov 12, 2023 | 9:37 PM

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో గుండె బలహీనంగా మారుతుంది. దీంతో వయసుతో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ లోనే గుండె పోటుతో మరణిస్తున్నారు. శరీరంలో అన్నింటిలో కంటే గుండె ప్రధానమైనది. గుండె చప్పుడు ఆగిపోతే.. ప్రాణమే పోతుంది. కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ డైట్ లో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా నివారించవచ్చు. మరి అవేంటో చూద్దాం.

ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు మాయమవడం మాత్రమే కాకుండా జుట్టు బలంగా మారుతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఫలితాన్ని మీరే చూస్తారు.

క్రాన్ బెర్రీస్ జ్యూస్: క్రాన్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్ లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్, రక్త పోటు, రక్తం గడ్డ కట్టడం వంటి వాటిని తగ్గిస్తాయి.

దానిమ్మ జ్యూస్: దానిమ్మతో గుండె జబ్బులకు బైబై చెప్పవచ్చు. తరచూ దానిమ్మను తిన్నా.. జ్యూస్ తాగినా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె వ్యవస్థని కాపాడతాయి.

టమాటా జ్యూస్: టమాటా జ్యూస్ కూడా గుండె ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. టమాటాలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు రక్త కణాలు మూసుకు పోకుండా పని చేస్తాయి. అలాగే రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి టమాటా జ్యూస్ బాగా హెల్ప్ చేస్తుంది.




