- Telugu News Photo Gallery Eating carrots during cold season is very good for health, check here is details
Carrot in Winter: చలి కాలంలో క్యారెట్స్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా!
మన ఆహారంలో క్యారెట్స్ కూడా ఒక భాగం. ఆరోగ్యాన్ని పెంచే వాటిల్లో క్యారెట్స్ కూడా ఒకటి. రోజూ క్రమం తప్పకుండా క్యారెట్స్ తింటే రక్త హీనత, కంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత ఇంకా ఎన్నో సమస్యలను తగ్గించు కోవచ్చు. అయితే ముఖ్యంగా చలి కాలంలో క్యారెట్స్ ని ఎక్కువగా తినమని చెబుతూ ఉంటారు వైద్యులు. క్యారెట్స్ లో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైడర్, మంచి కొవ్వులు..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 11, 2023 | 8:34 PM

మన ఆహారంలో క్యారెట్స్ కూడా ఒక భాగం. ఆరోగ్యాన్ని పెంచే వాటిల్లో క్యారెట్స్ కూడా ఒకటి. రోజూ క్రమం తప్పకుండా క్యారెట్స్ తింటే రక్త హీనత, కంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత ఇంకా ఎన్నో సమస్యలను తగ్గించు కోవచ్చు. అయితే ముఖ్యంగా చలి కాలంలో క్యారెట్స్ ని ఎక్కువగా తినమని చెబుతూ ఉంటారు వైద్యులు. మరి వింటర్ సీజన్ లో క్యారెట్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్స్ లో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైడర్, మంచి కొవ్వులు, విటమిన్లు ఏ, కే వంటివి ఉంటాయి. అంతే కాకుండా క్యారెట్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. చలి కాలంలో ఆహారం అనేది త్వరగా జీర్ణం కాదు. క్యారెట్స్ తినడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే చర్మం కూడా తేమగా, పొడిబారకుండా ఉంటుంది.

కంటి చూపుకి చాలా బెస్ట్: క్యారెట్స్ ని క్రమం తప్పకుండా తింటే.. ఎలాంటి కంటి సమస్యలు రావు. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు కూడా రాకుండా క్యారెట్స్ నిరోధిస్తాయి. ఇందులో ఉండే బీగా కెరోటిన్ ని.. విటమిన్ ఏగా మారుస్తుంది శరీరం. ఇది మన కళ్లకు రక్షణగా నిలుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి: క్యారెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అలాగే బాడీలో అంతర్గత అవయవాలు సరిగ్గా పని చేసేలా సహాయ పడుతుంది.

గుండెకు మంచిది: క్యారెట్స్ లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల బాడీలో రక్త ప్రసరణ అనేది సాఫీగా జరుగుతుంది. అదే విధంగా రక్త పోటును తగ్గిస్తుంది.





























