Urinate at Night: రాత్రిళ్లు పదేపదే మూత్రవిసర్జన చేస్తున్నారా? జాగ్రత్త ఈ ప్రాణాంతక వ్యాధి కారణం కావచ్చు..
రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగినా లేదా రాత్రి భోజనంలో ద్రవ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా.. ఇలాంటి సందర్భాల్లో రాత్రి పూట కనీసం ఒక్కసారైనా బాత్ రూంకి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ కారణాలతో సంబంధం లేకుండా రాత్రిపూట నిద్రలేచి పదేపదే టాయిలెట్‌కు వెళ్తున్నట్లయితే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవల్సిన అవసరం ఉంది. తరచుగా మూత్రవిసర్జన మధుమేహంకు కారణం అవుతుంది. పురుషుల్లో ఈ లక్షణాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కారణం కావచ్చు. కాబట్టి రాత్రిపూట నిద్ర సమయంలో..
రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగినా లేదా రాత్రి భోజనంలో ద్రవ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా.. ఇలాంటి సందర్భాల్లో రాత్రి పూట కనీసం ఒక్కసారైనా బాత్ రూంకి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ కారణాలతో సంబంధం లేకుండా రాత్రిపూట నిద్రలేచి పదేపదే టాయిలెట్‌కు వెళ్తున్నట్లయితే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవల్సిన అవసరం ఉంది. తరచుగా మూత్రవిసర్జన మధుమేహంకు కారణం అవుతుంది. పురుషుల్లో ఈ లక్షణాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కారణం కావచ్చు. కాబట్టి రాత్రిపూట నిద్ర సమయంలో మూత్ర విసర్జనకు, పదే పదే బాత్ రూంకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే రాత్రి నిద్ర సమయంలో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం సురక్షితం అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో 24 శాతం మంది వ్యక్తులు రాత్రి సమయంలో కనీసం 3 సార్లు బాత్రూమ్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఇ క పురుషులను టాయిలెట్‌కు ఎన్నిసార్లు వెళ్లారు అనే విషయం గురించి అడిగినప్పుడు 20 శాతం మంది తమకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని భావించారు. అంతేకాకుండా 29 శాతం మంది అధిక వయస్సు కారణంగా తాము ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నట్లు భావించారు. మరికొందరు పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం లేదా రాత్రిపూట కెఫిన్ కలిగిన పానీయాలు తాగడం వల్ల మూత్ర విసర్జనకు అధికసార్లు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట టాయిలెట్‌కు తరచుగా వెళ్లడం వెనుక అనేక శారీరక పరిస్థితులు కారణం కావచ్చంటున్నారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఎక్కువగా మూత్రవిసర్జన చేయడానికి కారణం అవుతుంది. అందువల్లనే రాత్రి సమయంలో తరచుగా మేల్కొనడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఈ రకమైన సమస్య ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఈ సందర్భంలో నొప్పి ఉన్నప్పటికీ, మూత్ర విసర్జన సమయంలో మంట సమస్యగా కూడా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట నిద్రలేవగానే మూడుసార్లకు మించి టాయిలెట్‌కి వెళ్లారంటే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.
కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు రాత్రిపూట తరచుగా బాత్రూమ్‌కు వెళ్లే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 55 శాతం ఉందని కనుగొన్నారు. వారిలో దాదాపు 43 శాతం మంది పురుషుల్లో ఈ లక్షణాలు కనిపించినా వైద్యుల వద్దకు వెళ్లనట్లు తెలిపారు. 50 ఏళ్లు పైబడిన పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నేటి కాలంలో మధుమేహం రావడానికి నిర్దిష్ట వయస్సు లేదు. కాబట్టి ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తాకధనాల కోసం క్లిక్ చేయండి.