- Telugu News Photo Gallery Health Benefits of Pumpkin Seeds: Eating pumpkin seeds daily can ward off all diseases from heart disease to cancer
Pumpkin Seeds: మీరూ గుమ్మడి విత్తనాలు తింటున్నారా? గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు.. ఎన్ని లాభాలో!
ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు ఎల్లప్పుడూ చెబుతుంటారు. అలాగు విత్తనాలు తినడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. గుమ్మడి గింజల్లో అధిక మొత్తంలో మెగ్నీషియం, జింక్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది..
Updated on: Nov 12, 2023 | 8:24 PM

ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు ఎల్లప్పుడూ చెబుతుంటారు. అలాగు విత్తనాలు తినడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. గుమ్మడి గింజల్లో అధిక మొత్తంలో మెగ్నీషియం, జింక్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుంది.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల్లో జింక్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ గింజల్లో ఉండే ఐరన్, సెలీనియం, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నిద్ర సమస్యలతో బాధపడేవారు ఆహారంలో గుమ్మడి గింజలను తప్పనిసరిగా తీసుకోవాలి. గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒక రకమైన అమైనో ఆమ్లం. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

గుమ్మడి గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే, ఖచ్చితంగా గుమ్మడి గింజలను తినండి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇతర క్యాన్సర్ల చికిత్సలో గుమ్మడికాయ గింజలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

మధుమేహంతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే, గుమ్మడికాయ గింజలను తప్పనిసరిగా తినాలి.




