AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain leaves benefits: భోజనం తర్వాత ఈ ఆకును తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండోయ్!

వాము ఆకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాము గురించి చాలా మందికి తెలుసు. పూర్వం అయితే వాము ఆకుతో బజ్జీలు వేసేవారు. వాము ఆకులో పోషకాలు చాలా ఎక్కువ. ప్రతి రోజూ భోజనం చేసిన తర్వా వాము ఆకు తింటే చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా వాము ఆకును వివిధ అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగింస్తారు. ముఖ్యంగా వాము ఆకుతో జీర్ణ సమస్యలు దూరం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా వాము ఆకుతో..

Ajwain leaves benefits: భోజనం తర్వాత ఈ ఆకును తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండోయ్!
Ajwain Leaves
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 12, 2023 | 9:38 PM

Share

వాము ఆకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాము గురించి చాలా మందికి తెలుసు. పూర్వం అయితే వాము ఆకుతో బజ్జీలు వేసేవారు. వాము ఆకులో పోషకాలు చాలా ఎక్కువ. ప్రతి రోజూ భోజనం చేసిన తర్వా వాము ఆకు తింటే చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా వాము ఆకును వివిధ అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగింస్తారు. ముఖ్యంగా వాము ఆకుతో జీర్ణ సమస్యలు దూరం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా వాము ఆకుతో తయారు చేసిన ఆహారాన్ని ఇవ్వొచ్చు. ఇంకా వాము ఆకుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమలకు చెక్:

ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత వాము ఆకుల్ని నమిలి తినడం వల్ల శరీరంలో హార్మోన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. దీంతో పింపుల్స్ సమస్యను తగ్గించు కోవచ్చు.

ఇవి కూడా చదవండి

జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది:

వాము ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయి.

నోరు ఆరోగ్యంగా ఉంటుంది:

ఒక్కొక్కరికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు అప్పుడప్పుడు వాము ఆకు నమలడం వలన నోటి దుర్వాసన దూరం అవుతుంది. అంతే కాకుండా వాము ఆకును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది. నోరు రిఫ్రెష్ గా ఉంటుంది. అలాగే నోటిలో బ్లీడింగ్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

జీర్ణ క్రియ సమస్యలకు చెక్ పెట్టవచ్చు:

వాము ఆకును ఆహారంతో తిన్నా లేక భోజనం చేశాక వాము ఆకుల్ని నమిలినా జీర్ణ సమస్యలు అన్నీ పోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, మల బద్ధంకంతో ఇబ్బంది పడే వారు వాము ఆకుల్ని తినడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీంతో కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటివి దూరం అవుతాయి.

ఇమ్యూనిటీ లభిస్తుంది:

భోజనం చేసిన తర్వాత వాము ఆకుల్ని నమలడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల బాడీని పలు రకాల ఇన్ ఫెక్షన్లు సోకకుండా కాపాడు కోవచ్చు. అంతే కాకుండా జ్వరం, జలుబు, తల నొప్పి, దగ్గు వంటి సమస్యలు కూడా దూరం చేస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పిన పాక్
147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పిన పాక్
తాతయ్యే వయసులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
తాతయ్యే వయసులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్