- Telugu News Photo Gallery Diwali 2023: simple and low budget Diwali decoration ideas at home, check here is details
Diwali Decoration Ideas: దీపావళికి తక్కువ ఖర్చుతో మీ ఇంటిని అద్భుతంగా అలంకరించుకోండి!
దీపావళి పండుగ వచ్చేసింది. ఇళ్లంతా వెలుగులతో కొత్త రూపు దిద్దుకుంటుంది. అయితే దీపావళి పండక్కి అలంకరణే ఇంపార్టెంట్. అందరిక కంటే భిన్నంగా ఇంటిని అలంకరించు కోవాలని అందరూ అనుకుంటూంటారు. అయితే అది ఖర్చుతో కూడుకున్న పని. అయితే తక్కువ ఖర్చుతో ఇంటిని అలంకరించు కోవాలనుకునే వారికి ఈ టిప్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అలంకరణలో మార్పు చేయండి: మీరు ప్రతి దీపావళికి ఒకే విధంగా అలంకరిస్తే మాత్రం..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 11, 2023 | 8:40 PM

దీపావళి పండుగ వచ్చేసింది. ఇళ్లంతా వెలుగులతో కొత్త రూపు దిద్దుకుంటుంది. అయితే దీపావళి పండక్కి అలంకరణే ఇంపార్టెంట్. అందరిక కంటే భిన్నంగా ఇంటిని అలంకరించు కోవాలని అందరూ అనుకుంటూంటారు. అయితే అది ఖర్చుతో కూడుకున్న పని. అయితే తక్కువ ఖర్చుతో ఇంటిని అలంకరించు కోవాలనుకునే వారికి ఈ టిప్స్ బాగా హెల్ప్ చేస్తాయి.

అలంకరణలో మార్పు చేయండి: మీరు ప్రతి దీపావళికి ఒకే విధంగా అలంకరిస్తే మాత్రం.. ఈ సారి కాస్త డిఫరెంట్ గా మార్చండి. ముందు ఇంటిని శుభ్రం చేయండి. పనికి రాని వస్తువుల్ని పారేయండి. మీకు ముందుగా ఎలాంటి అలంకరణ కావాలో దానికి తగ్గట్టుగా ప్లాన్ వేసుకోవాలి. దీంతో మన చూపు వేరే వైపుకు వెళ్లకుండా ఉంటుంది. మీ డబ్బు కూడా సేవ్ అవుతుంది.

కలర్ ఫుల్ రంగోలి ఎంచుకోండి: దీపావళి అంటేనే కలర్ ఫుల్ లైట్స్. కాబట్టి మీరు మీ ఇంటి ముందు వేసే ముగ్గులో కూడా మంచి కలర్స్ ని ఎంచు కోండి. ఇది పండుగ వాతావరణాన్నే మార్చేస్తుంది.

రంగు రంగుల దీపాలు ఎంచుకోండి: సాధారణంగా అందరం మట్టి దీపాలను వెలిగించడానికి ఇంపార్టెంట్స్ చూపిస్తారు. అయితే ఈ సారి ఆ మట్టి దీపాలనే రంగు రంగులవి ఎంచుకోండి. లేదా పెయింట్స్ తీసుకొచ్చి.. ఆ దీపాలకు పెయింటింగ్స్ గీయండి.

ఎల్ఈడీ లైట్స్: మీ ఇంటికి మరింత కొత్త లుక్ రావాలంటే.. ఎల్ఈడీ లైట్స్ ను ఎంచుకోండి. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ఎల్ఈడీ లైట్లు ఎన్నో వచ్చాయి. కాబట్టి వాటిల్లో మీకు నచ్చేవి ఎంచుకోండి. ఇవి మీ ఇంటి అందాన్నే మార్చేస్తాయి. వీటిని ఇంట్లో అక్కడక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.





























