- Telugu News Photo Gallery Political photos Crackers traders are following a new trend in Andhra Pradesh
Diwali 2023: కొత్త తరహా క్రాకర్స్ వ్యాపారం.. ఎగబడి కొంటున్న జనం
వచ్చే ఏడాది ఏపిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి క్రాకర్స్‌ను అమ్ముకునేందుకు వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు తలమునకలై ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అందులో భాగంగా దీపావళి పండుగలో ప్రముఖ పాత్ర పోషించే బాణాసంచాను అమ్ముకునేందుకు వ్యాపారులు లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.
Fairoz Baig | Edited By: Srikar T
Updated on: Nov 11, 2023 | 9:15 PM

వచ్చే ఏడాది ఏపిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి క్రాకర్స్‌ను అమ్ముకునేందుకు వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు తలమునకలై ఉన్నారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అందులో భాగంగా దీపావళి పండుగలో ప్రముఖ పాత్ర పోషించే బాణాసంచాను అమ్ముకునేందుకు వ్యాపారులు లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

ముఖ్యంగా ఏపిలో లీడర్స్ ఫోటోతో క్రాకర్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి పండుగ వేళ క్రాకర్స్‌ను క్యాష్ చేసుకునేందకు రాజకీయ నేతల ఫోటోలు, పేర్లతో అట్టలపై ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ తరహాలోనే ప్రకాశంజిల్లా జరుగుమల్లి మండలంలోని ఓ చిన్న గ్రామం కామేపల్లిలో సైతం క్రాకర్స్ దుకాణంలో వివిధ పార్టీ నాయకుల చిత్రాలతో కనువిందు చేస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి ఫోటో ముద్రించిన క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారుల పంట పండిందనే చెప్పాలి.

రాజకీయ నేతలు, సెలబ్రీటీల పేర్లు పెట్టి క్రాకర్స్‌ను అమ్ముకోవడం ఇప్పటికిప్పుడు వచ్చిన ట్రేండేమీ కాదు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫొటో ముద్రించిన క్రాకర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ప్యాకేట్లపై 'మేడ్ ఇన్ ఇండియా' అన్న ట్యాగ్‌ని కూడా ముంద్రించి బీజేపీ కార్యకర్తలను ఆకర్షిస్తున్నారు.

ఇదే తరహాలో ఏపీలో కూడా క్రాకర్స్ అట్టలపై సీఎం వైయస్ జగన్, వైయస్‌ఆర్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించి అమ్మేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టిన క్రాకర్స్ పెట్టెలపై జనసేన రాజకీయపార్టీ పేరు కూడా ముద్రంచారు.





























