AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart: మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఇలా చేయండి.. లేకుంటే అంతే..

ప్రస్తుతం ప్రపంచంలో మనుషుల ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా గుండెపై ప్రభావం చూపే అవాలట్లతో అనారోగ్యం బారిన పడుతున్నారు..

Heart: మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఇలా చేయండి.. లేకుంటే అంతే..
Heart
Srinivas Chekkilla
|

Updated on: Dec 14, 2021 | 8:31 AM

Share

ప్రస్తుతం ప్రపంచంలో మనుషుల ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా గుండెపై ప్రభావం చూపే అవాలట్లతో అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది గుండె పోటుతో మృతి చెందుతున్నారు. 25 ఏళ్ల వయస్సు నుంచి 90 వయస్సు వరకు గుండె పోటుకు బలవుతున్నారు. దీనికి కారణం ఆహరపు అలవాట్లే అంటున్నారు నిపుణులు. చాలా మంది అనారోగ్యకరమైన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటారు. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నేరుగా ప్రభావితం చేసే హానికరమైన అలవాటు. జంక్ ఫుడ్ కాకుండా పోషక ఆహారం తినడం మంచిది.

మిమ్మల్ని ఫిట్‌గా, వినోదభరితంగా ఉంచే సరైన వ్యాయామం చేయడం మంచిది. అయితే మీ పని సమయానికి వ్యాయాయం చేయడానికి కుదరడం లేదనుకుంటారు. అయితే వ్యాయామం అంటే జిమ్‌కు వెళ్లి చేయనక్కర్లేదు.. ఇంట్లోనే నెమ్మదిగా చేసుకోవచ్చు. నడక వంటి తక్కువ తీవ్రత వ్యాయామాలు చేస్తే మంచిది. ఇరవై నిమిషాల పాటు చేసే కార్యకలాపాలు గుండె ఆరోగ్య నిర్వహణలో గొప్పగా సహాయపడతాయి. కేవలం ఇరవై నిమిషాల పాటు నడవడం, పరుగెత్తడం లేదా క్రీడలు ఆడటం మీ కార్డియో-వాస్కులర్ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

పొగ తాగడం కూడా గుండెకు మంచిది కాదు. కార్బన్ మోనాక్సైడ్ సిగరెట్ల ప్రధాన మూలకం. ఇది ఆరోగ్యకరమైన రక్త గణనను తగ్గించడానికి అధిక కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ఒత్తిడి కూడా మనిషి గుండెపై ప్రభావం చూపుతుంది. పని, కుటుంబం లేదా ఇతర కారణాల వల్ల అధిక ఒత్తిడి గుండెపై ఒత్తిడి తెచ్చి, కొలెస్ట్రాల్ స్థాయికి దారి తీస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడానికి చాలా మంది మద్యం సేవించడం, పొగ తాగడం చేస్తుంటారు. ఇది కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Read Also.. Health Tips: స్నానం చేసే ముందు నీటిలో వేపాకు వేసుకుంటే ఎన్నో లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..