AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: ఈ మసాలాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట.. అంతేకాదు ఇంకా ఎన్నో!

మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా.. అనారోగ్యం పాలవ్వాలన్నా తినే ఆహారమే కీ రోల్ పాటిస్తుంది. అయితే ఆ ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామన్నది ముఖ్యం. ఎంత ఆరోగ్యాన్ని కాపాడేదైనా.. అతిగా తింటే సమస్యలు తప్పవు. కాబట్టి ఏది తిన్నా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, జీర్ణ సమస్యలు వస్తాయని, గుండెకి మంచికాదని అంటూంటారు. కానీ కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు..

Health Care: ఈ మసాలాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట.. అంతేకాదు ఇంకా ఎన్నో!
Masala Dinusulu
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 23, 2023 | 7:15 PM

Share

మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా.. అనారోగ్యం పాలవ్వాలన్నా తినే ఆహారమే కీ రోల్ పాటిస్తుంది. అయితే ఆ ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామన్నది ముఖ్యం. ఎంత ఆరోగ్యాన్ని కాపాడేదైనా.. అతిగా తింటే సమస్యలు తప్పవు. కాబట్టి ఏది తిన్నా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, జీర్ణ సమస్యలు వస్తాయని, గుండెకి మంచికాదని అంటూంటారు. కానీ కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు తింటే ఎన్నో లాభాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా. కిచెన్ లోని ఉండే, మనం నిత్యం వాడే మసాలాలు, పోపు దినుసులతో ఎన్నో ఇన్ ఫెక్షన్లు, వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలా కొన్ని మసాలా దినుసులు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చెడు కొలెస్ట్రాల్.. మధు మేహం ఉన్న వారికి బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఎంతో బెటర్.

ఇవి కూడా చదవండి

మిరియాలు:

మిరియాల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్, ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను కరిగింది.. వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. నల్ల మిరియాల్లో ఉండే వెనాడియం మెండుగా ఉంటుంది.

ధనియాలు:

ధనియాల్లో రుచిని మాత్రమే కాకుండా.. జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా గూరం చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాల బెటర్. ధనియాలు తింటే గుండె సమస్యలు, రక్త పోటు, షుగర్ వంటి వాటిని అదుపులోకి తీసుకు రావచ్చు.

వెల్లుల్లి పాయలు:

ఆరోగ్యంగా ఉండడంలో వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. రక్త పోటును కంట్రల్ చేయడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా కరోనరీ ధమనుల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

అల్లం:

భారతీయుల వంటగదిలో అల్లం అనేది కామన్ గా లభించే వస్తువు. అల్లం లేకుండా సాధారణంగా ఎలాంటి వంటలు పూర్తి కావు. అందులోనూ అల్లంతో ఎన్నో ఇన్ ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులకు బైబై చెప్పవచ్చు. కడుపు నొప్పి, విరోచనాలు, వికారం వంటి వాటికి అల్లంతో చెక్ పెట్టవచ్చు. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కాలేయ పనితీరు మెరుగు పరచడమే కాకుండా.. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు బాగా హెల్ప్ చేస్తుంది.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.